Share News

టెక్నికల్‌ గ్రేడ్‌ యూరియానే వాడాలి

ABN , Publish Date - May 21 , 2026 | 10:46 PM

జిల్లాలోని పరిశ్రమలకు వ్యవసాయ యూరియా కాకుండా టెక్నికల్‌ యూరియాను మాత్రమే వినియోగించాలని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

  టెక్నికల్‌ గ్రేడ్‌ యూరియానే వాడాలి
యూరియాను పరిశీలిస్తున్న డీఏవో వెంకటేశ్వర్లు

నంద్యాల రూరల్‌, మే 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని పరిశ్రమలకు వ్యవసాయ యూరియా కాకుండా టెక్నికల్‌ యూరియాను మాత్రమే వినియోగించాలని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌, నంది డైయిరీ పరిశ్రమలను పౌర సరఫరాశాఖ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి ఉపయోగిస్తున్న యూరియాను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నికల్‌ గ్రేడ్‌ యూరియాను మాత్రమే వాడుతున్నారన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి వ్యవసాయ యూరియా వాడితే ఎప్‌సీవో 1985 ప్రకారం చర్యలు తీసుకంటామని హెచ్చరించారు. తనిఖీల్లో వ్యవసాయ సహాయ సంచాలకుడు గంగాధర్‌రావు, నంద్యాల మండల వ్యవసాయ అధికారి ప్రసాదరావు, సాంకేతిక వ్యవసాయ అఽధికారి కళ్యాణ్‌ పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2026 | 10:46 PM