ఆన్‌లైన్‌లో ఎంగేజ్‌మెంట్!
ABN , Publish Date - Jul 09 , 2026 | 11:56 PM
ప్రస్తుతం అంతా ఆన్‌లైన్‌మయమైంది. వివాహ నిశ్చితార్థాలు కూడా ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి.
వధూ వరులు అమెరికాలో ఫ కర్నూలులో నిశ్చితార్థ వేడుకలు
కర్నూలు హాస్పిటల్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం అంతా ఆన్‌లైన్‌మయమైంది. వివాహ నిశ్చితార్థాలు కూడా ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. అమెరికాలోని విస్కాన్సిన్ స్టేట్‌లో నూతన జంట ఉండగా కర్నూలు నుంచి తల్లిదండ్రులు గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో హెల్త్ ఇన్‌స్పెక్టర్‌గా టి. గోవిందు స్వామి, శివశ్యామల కుమారి దంపతుల కుమార్తె మేఘన అమెరికాలో సైంటిస్టుగా పని చేస్తున్నారు. తిరుపతికి చెందిన కుమార్‌బాబు, శ్రీదేవి దంపతుల కుమారుడు ప్రేమ్ కుమార్ అమెరికాలోనే సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరూ ఇష్టపడ్డారు. ఈ విషయాన్ని పెద్దలకు చెప్పడంతో అంగీకరించారు. దీంతో పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలనుకున్నారు. అమెరికా నుంచి రావడానికి వీసా సమస్యలు ఉన్నందు వల్ల ఆన్‌లైన్‌లో నిశ్చిత్తార్థం చేయాలని నిర్ణయించారు. నగర శివారులోని ఓ హోటల్‌లో సరిగ్గా ఉదయం 11 గంటలకు నిశ్చిత్తార్థం జరిగింది. ఆ సమయంలో అమెరికాలో అర్ధరాత్రి 12:30 గంటలైంది. భారీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. ఇండియాలో పురోహితుడు వేద మంత్రాలు చదు వుతుండగా అమె రికాలో జంట ఉంగరాలను మా ర్చుకున్నారు. పెళ్లి అమెరికాలోని న్యూ యార్క్‌లో ఆగస్టు 30న జరుగుతుంది.