Share News

దెబ్బతిన్న ఉల్లి.. దున్నేసిన రైతు

ABN , Publish Date - Nov 08 , 2026 | 12:42 AM

ఎల్‌నినో ప్రభావానికితోడు తెగులు సోకడంతో ఉల్లిపంట దెబ్బతిని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

 దెబ్బతిన్న ఉల్లి.. దున్నేసిన రైతు
కొలుమానుపేటలో ఉల్లిపంటను దున్నేస్తున్న రైతు

తెగులు ప్రభావంతో పంట రాలేదని ఆవేదన

చాగలమర్రి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావానికితోడు తెగులు సోకడంతో ఉల్లిపంట దెబ్బతిని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని కొలుములపేట గ్రామానికి చెందిన వెంకటేషు, సంజీవరెడ్డి, లక్ష్మిరెడ్డి, మరో అయిదుగురు రైతులు 20 ఎకరాల్లో కేపీ ఉల్లి సాగు చేశారు. ఎకరాకు రూ.60వేలు పెట్టుబడి పెట్టి, నాలుగు నెలలపాటు పంటను కాపాడుకుంటూ వచ్చామని తీరా దిగుబడి వచ్చే సమయంలో తెలుగు సోకి పంట దెబ్బతిందని వాపోయారు. తప్పని పరిస్థితుల్లో ట్రాక్టర్‌, కీలర్‌తో దున్నేశామని, ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Nov 08 , 2026 | 12:42 AM