Share News

ఉల్లిరైతు ధరహాసం

ABN , Publish Date - Sep 13 , 2026 | 11:10 PM

మార్కెట్‌లో ఉల్లిధరలు పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని ఏళ్లు పడిన కష్టం తీరీందని అంటున్నారు

ఉల్లిరైతు ధరహాసం
హెచ్‌.కొట్టాల గ్రామంలో ఉల్లిగడ్డలను నింపుతున్న కూలీలు

క్వింటా రూ.5వేలు.. హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

బేతంచెర్ల, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): మార్కెట్‌లో ఉల్లిధరలు పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని ఏళ్లు పడిన కష్టం తీరీందని అంటున్నారు. ఖరీ్‌ఫలో మండలంలోని హెచ్‌ కొట్టాల, ఆర్‌ఎస్‌ రంగాపురం, సీతారామాపురం, బైనపల్లె, ఎంబాయి, ఎం పెండేకల్‌, తదితర గ్రామాల్లో 700 ఎకరాల్లో రైతులు ఉల్లి పంట సాగుచేశారు. హెచ్‌.కొట్టాల గ్రామంలో 60ఎకరాల్లో కృష్ణమోహన్‌, రాజేంద్ర కుమార్‌, చిన్నారావు, వెంకట నారాయణ, ఎండూరి రవికుమార్‌ అనే రైతులు సాగు చేశారు.

ధర పెరగడంతో హర్షం..

కొన్ని నెలల క్రితం క్వింటా రూ.700 పలుకగా ప్రస్తుతం క్వింటా రూ.5వేలు ఽపలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాబావ పరిస్థితులు ఉన్నా బోరు బావుల కింద సాగుచేసిన ఉల్లిలో మంచి దిగుబడి వచ్చిందంటున్నారు. ఎకరాకు 90 నుంచి 140 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని పెట్టుబడులు చేతికందాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు.

గతేడాది నష్టం..

గతేడాది రూ.లక్షలు పెట్టుబడి పెట్టి ఉల్లి సాగుచేస్తే పెట్టుబడి కూడా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటా రూ.700కు పలకడంతో తీవ్రంగా నష్టపోయామని ఈ ఏడాది నష్టాలనుంచి గట్టెమంటున్నారు

Updated Date - Sep 13 , 2026 | 11:10 PM