Share News

కొనసాగుతున్న న్యాయవాదుల నిరసన

ABN , Publish Date - Sep 03 , 2026 | 12:16 AM

కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచను ఏర్పాటు చేయాలని న్యాయవాదుల చేపట్టిన నిరసన కొనసాగుతోంది.

కొనసాగుతున్న న్యాయవాదుల నిరసన
రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న మహిళా న్యాయవాదులు

కర్నూలు లీగల్‌, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచను ఏర్పాటు చేయాలని న్యాయవాదుల చేపట్టిన నిరసన కొనసాగుతోంది. బుధవారం మహిళా న్యాయవాదు లు బుధవారం రిలే నిరాహారదీక్షలు నిర్వహించారు. సీనియర్‌ న్యాయ వాది వి.నాగలక్ష్మిదేవి ఆధ్వర్యంలో మహిళా న్యాయవాదులు తమ కోర్టు విధులను బహిష్కరించి శిబిరంలో దీక్షను ప్రారంభించారు. బార్‌ అసోసియేషన అధ్యక్షుడు బి.చంద్రుడు మాట్లాడుతూ శాశ్వత హైకోర్టు బెంచ కేవలం న్యాయవాదుల డిమాండ్‌ మాత్రమే కాదని ఇది రాయలసీమ ప్రజల న్యాయపరమైన అవసరమన్నారు. రాయల సీమ ప్రజలు హైకోర్టు సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో ప్రజలకు సమయం, ఆర్థిక భారం పెరుగుతున్నారు. మహిళా సీనియర్‌ న్యాయవాది వి.నాగలక్ష్మీదేవి మాట్లాడు తూ హైకోర్టు బెంచ కోసం పది రోజులుగా కొనసాగుతున్న ఉద్యమానికి న్యాయవాదులు, న్యాయవిద్యార్థులు, ప్రజల నుంచి వస్తున్న మద్దతు తమ పోరాటానికి మరింత బలాన్ని ఇస్తుందన్నారు. కాగా బుధవారం మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్‌ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చలే దన్నారు. స్థానిక జిల్లా కోర్టు సమీపంలో న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహా రదీక్షల శిబిరాన్ని వైసీపీ నేతలు బుధవారం సందర్శించి తమ సంఘీ భావాన్ని వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డిలు దీక్షలకు తమ మద్దతు ప్రకటించారు.

Updated Date - Sep 03 , 2026 | 12:16 AM