Share News

వన్‌ స్టాప్‌ సెంటర్‌ ద్వారా మహిళలకు భరోసా

ABN , Publish Date - Apr 22 , 2026 | 11:25 PM

ఆపదలో ఉన్న మహిళలకు వన్‌ స్టాప్‌ సెంటర్‌ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి పేర్కొన్నారు.

వన్‌ స్టాప్‌ సెంటర్‌ ద్వారా మహిళలకు భరోసా
సబ్‌జైలులో ఖైదీలకు అందుతున్న భోజనాన్ని పరిశీలిస్తున్న లీలా వెంకటశేషాద్రి

సబ్‌ జైలు, వన్‌ స్టాప్‌ సెంటర్‌ను తనిఖీ చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

ఆదోని, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఆపదలో ఉన్న మహిళలకు వన్‌ స్టాప్‌ సెంటర్‌ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి పేర్కొన్నారు. బుధవారం ఆదోని ఏరియా ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన వన్‌ స్టాప్‌ సెంటర్‌ను, స్థానిక సబ్‌ జైలును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వన్‌స్టాప్‌ సెంటర్‌లో అందుతున్న సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. గృహహింస, అత్యాచార బాధితులు, లైంగిక వేధింపులు, యాసిడ్‌ దాడులు, బాల్య వివాహాలు, సైబర్‌ నేరాల బారినపడిన మహిళలకు రక్షణ కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి యజ్ఞ నారాయణ, జిల్లా బాలల పరిరక్షణ అధికారి శారద, జైలు సూపరింటెండెంట్‌ నజీర్‌అహ్మద్‌, విజిటింగ్‌ అడ్వకేట్‌ రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

ఖైదీలకు నాణ్యమైన భోజనం అందించాలి

పత్తికొండ(ఆంధ్రజ్యోతి): సబ్‌ జైలులో ఖైదీలకు నాణ్యమైన భోజనం అందించాలని అన్ని సదుపాయాలను కల్పించాలని జిల్లా న్యాయాధికారి లీలా వెంకట శేషాద్రి అన్నారు. బుధవారం సినియర్‌ సివిల్‌ న్యాయాధికారి జ్యోత్స్నాదేవితో కలసి ఆయన పత్తికొండ సబ్‌ జైల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీల గదులతోపాటు వారికి అందించే భోజనాన్ని ఆయన పరిశీలిం చారు. ఈ కార్యక్రమంలో లోక్‌ అదాలత్‌ లీగల్‌ ఎయిడ్స్‌ కౌన్సిల్‌ న్యాయవాది నగేష్‌, రూరల్‌ సీఐ పులిశేఖర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 22 , 2026 | 11:25 PM