Share News

గెలుపే లక్ష్యంగా పని చేయాలి

ABN , Publish Date - Nov 13 , 2026 | 12:13 AM

రానున్న సర్పంచ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

గెలుపే లక్ష్యంగా పని చేయాలి
ఉలిందకొండ టీడీపీ నాయకులతో చర్చిస్తున్న గౌరు దంపతులు

కల్లూరు, ఓర్వకల్లు నాయకుల సమీక్షలో గౌరు దంపతులు

కల్లూరు, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): రానున్న సర్పంచ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. గురువారం మాధవీనగర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్లూరు, ఓర్వకల్లు మండల టీడీపీ నాయకులు కార్యకర్తలతో నందికొ ట్కూరు టీడీపీ ఇనచార్జి గౌరు వెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే సన్న ద్ధతా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా గౌరు దంపతులు మాట్లాడుతూ సర్పంచు ఎన్నికల్లో సన్నద్ధత, గ్రామాల వారీగా పార్టీ పరిస్థితులు, అనుసరించాల్సిన వ్యూహం కార్యాచరణపై చర్చించారు. గ్రామాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఎన్నికల ప్రక్రియలో ముందుకు వెళ్లాలన్నారు. కల్లూరు, ఓర్వకల్లు మండలా ల్లోని అన్ని గ్రామాల్లో వందశాతం విజయం సాధించాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2026 | 12:13 AM