Share News

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

ABN , Publish Date - Aug 13 , 2026 | 12:59 AM

కళాశాలలో జరుగు తున్న ర్యాగింగ్‌, డ్రగ్స్‌, మాదక ద్రవ్యాలపై యువత సమరం ప్రక టించి వాటికి దూరంగా ఉంటూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి విద్యార్థు లకు సూచించారు.

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి

కర్నూలు లీగల్‌, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): కళాశాలలో జరుగు తున్న ర్యాగింగ్‌, డ్రగ్స్‌, మాదక ద్రవ్యాలపై యువత సమరం ప్రక టించి వాటికి దూరంగా ఉంటూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి విద్యార్థు లకు సూచించారు. బుధవారం వెంకాయపల్లె సమీపంలోని జి.పుల్ల య్య ఇంజనీరింగ్‌ కళాశాలలో వివేకానంద యువ ఫోరమ్‌, న్యాయ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన ఓ కార్యక్ర మానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడు తూ ర్యాగింగ్‌ భూతం చట్టరీత్యా నేరమని, అది విద్యార్థుల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసే అమానుష చర్య అని తెలిపారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, అది వారి కు టుంబానికి ఇచ్చే భరోసా అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డా.సి.శ్రీనివా సరావు మాట్లాడుతూ తమ క్యాంపస్‌లో ర్యాగింగ్‌, డ్రగ్స్‌ రహిత ప్రాంగణంగా తీర్చిదిద్దామని, ప్రతి విద్యార్థి ట్రాఫిక్‌ నియమాలు పాటించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఆ తర్వాత జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి విద్యార్థులచేత మాదక ద్రవ్యా లు, ర్యాగింగ్‌లకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.

Updated Date - Aug 13 , 2026 | 12:59 AM