Share News

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

ABN , Publish Date - Aug 09 , 2026 | 11:18 PM

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని రాయలసీమ వర్సిటీ ఎన్‌ఎ్‌సఎ్‌స కోఆర్డినేటర్‌ బి. కవిత, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కర్నూలు సీనియర్‌ తైక్వాండో కోచ్‌ కె. కార్తికేయన్‌ పిలుపునిచ్చారు.

 మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
కొండారెడ్డి బురుజు వద్ద ‘నషా ముక్త్‌ భారత్‌’ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న యువత

కర్నూలు కల్చరల్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని రాయలసీమ వర్సిటీ ఎన్‌ఎ్‌సఎ్‌స కోఆర్డినేటర్‌ బి. కవిత, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కర్నూలు సీనియర్‌ తైక్వాండో కోచ్‌ కె. కార్తికేయన్‌ పిలుపునిచ్చారు. ఎన్‌ఎ్‌సఎ్‌స హైదరాబాదు రీజియన్‌ కార్యాలయం, క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ అధికారుల సూచనల మేరకు, ఆర్‌యూ ఎన్‌ఎ్‌సఎ్‌స విభాగం ఆధ్వర్యంలో, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) కర్నూలు శాఖ సహకారంతో ‘సండేస్‌ ఆన్‌ సైకిల్‌ - నషా ముక్త్‌ భారత్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం నగరంలోని ఎక్సైజ్‌ కార్యాలయం ఎదుట ఉన్న ఇండోర్‌ స్టేడియం వద్ద ఈ ర్యాలీని వారు ప్రారంభించారు. ఈ ర్యాలీ ఎస్టీబీసీ కళాశాల గ్రౌండ్‌ మీదుగా, కొండారెడ్డి బురుజు వరకు కొనసాగింది. వక్తలు మాట్లాడుతూ సైక్లింగ్‌ ఒక మంచి వ్యాయామమని, యువత క్రీడలతో పాటూ వ్యాయామానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించా రు. మంచి అలవాటు, జీవన శైలితో యువత ఎదగాలని, మాదక ద్రవ్యాలను దరిచేరకుండా చూడాలన్నారు. సైకిల్‌ ర్యాలీలో సెయింట్‌ జోసెఫ్స్‌ డిగ్రీ కళాశాల ఎన్‌ఎ్‌సఎ్‌స పీవో మల్లికార్జున, వలంటీర్లు, ఆర్‌యూ ఎన్‌ఎ్‌సఎ్‌స ప్రతినిధులు పాల్గొన్నారు. ‘యువత ఆరోగ్యంగా ఉండండి - మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి - ఆరోగ్యకరమైన భారత దేశాన్ని నిర్మిద్దాం అనే నినాదాలతో కొండారెడ్డి బురుజు వద్ద ప్లకార్డులు ప్రదర్శించారు.

Updated Date - Aug 09 , 2026 | 11:18 PM