సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Jun 20 , 2026 | 11:54 PM
అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజకుమారి తెలిపారు.
నంద్యాల నూనెపల్లె, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శనివారం పట్టణంలోని బొగ్గులైన్ సమీపంలోని అంగన్ వాడీ కేంద్రాన్ని ఆమె పరిశీలించి ప్రభుత్వం అందించిన సదుపాయాల వినియోగం, చిన్నారులకు అందుతున్న సేవలు, పోషణ ఆహార పంపిణీ విఽధానాన్ని సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రంలో పరిశుభ్రత ప్రణాలను మరింత మెరుగు పరచాలని ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
నీట్ ఏర్పాట్లపై సమీక్ష
ఈనెల 21న నిర్వహించనున్న నీట్ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ శనివారం విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. సీఎస్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 6790 అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని వారి కోసం 185 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవ కలకు అవకాశం లేకుండా భద్రత చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రశ్నా పత్రాలు, జవాబు పత్రాల రవాణ భద్రపరచడంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, సీసీ టీవీ నిఘాలో స్ర్టాంగ్ రూంలో భద్రపరచాలని సూచించారు. సోషల్ మిడియాలో పేపర్ల లీకేజీ వంటి తప్పుడు ప్రచారాలు, వదంతులు సృంచించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.