Share News

పర్యాటక ప్రాంతాల చరిత్రను తెలుసుకోవాలి

ABN , Publish Date - Sep 28 , 2026 | 12:17 AM

: పర్యాటకమంటే కేవలం ఒక ప్రాంతాన్ని సందర్శించడమే కాదని, ఆయా పర్యాటక పాంత్రాల చరిత్ర, విశిష్టత, ప్రాధాన్యం, మతపరమైన నేపథ్యాన్ని తెలుసుకోవడం కూడా పర్యాటకంలో భాగమని జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ అన్నారు.

పర్యాటక ప్రాంతాల చరిత్రను తెలుసుకోవాలి
విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న జేసీ

జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌

నంద్యాల నూనెపల్లి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): పర్యాటకమంటే కేవలం ఒక ప్రాంతాన్ని సందర్శించడమే కాదని, ఆయా పర్యాటక పాంత్రాల చరిత్ర, విశిష్టత, ప్రాధాన్యం, మతపరమైన నేపథ్యాన్ని తెలుసుకోవడం కూడా పర్యాటకంలో భాగమని జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ అన్నారు. పట్టణంలోని కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో ఆదివారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. మన ప్రాంతంలోని పర్యాటక ప్రదేశాల గురించి మరింత మందికి తెలిసేలా అందరూ కృషి చేయాలన్నారు. పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వ్యాసరచన, పెయింటింగ్‌, లఘుచిత్రాల తదితర పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. జిల్లా పర్యాటక శాఖ అధికారి సునీల్‌ కన్నా మాట్లాడుతూ.. జిల్లాలో పర్యాటకాభివృద్ధికి సంబంధించి మొత్తం 28 ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. కొలిమిగుండ్ల మండలంలోని బెలుంగుహలు సుమారు 2.49 కి.మీ. మేర విస్తరించి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన సహజ గుహలుగా నిలిచాయన్నారు. చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2026 | 12:17 AM