Share News

స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

ABN , Publish Date - Oct 31 , 2026 | 11:22 PM

జిల్లాలోని ప్రతి ఓటరు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ సూచించారు.

స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
పోలీసు సిబ్బందికి సూచనలు ఇస్తున్న ఎస్పీ

ఎస్పీ సునీల్‌ షెరాన్‌

నంద్యాల నూనెపల్లి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రతి ఓటరు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ సూచించారు. పట్టణంలోని పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద శనివారం పోలీసు బలగాలతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం జిల్లాలోని హైపర్‌ సెన్సిటివ్‌, సెన్సిటివ్‌, నార్మల్‌ పోలింగ్‌ కేంద్రాలకు తగిన స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. సీఐ స్ర్టైకింగ్‌ ఫోర్స్‌, ఎస్‌ఐ స్ర్టైకింగ్‌ ఫోర్స్‌తో పాటు రిజర్వ్‌ ఫోర్స్‌గా ఏపీఎస్పీ ప్లాటూన్లను కూడా అందుబాటులో ఉంచామని చెప్పారు. పోలింగ్‌ కేంద్రానికి వంద మీటర్ల పరిధిలో ఎలాంటి ఎన్నికల ప్రచారం కాని, ఓటర్లను ప్రభావితం చేసే విధమైన కార్యకలాపాలు నిర్వహించకూడదని ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి ఓటర్లు, అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లకు మాత్రమే నిబంధనలకు ప్రకారం అనుమతి ఉంటుందని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే ఎన్నికల సిబ్బందికి, పోలీసు బందోబస్తు సిబ్బందికి ఓటర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల పూర్తియ్యేలా చూడాలన్నారు.

Updated Date - Oct 31 , 2026 | 11:22 PM