ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:17 AM
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామీజీ ఉద్బోధించారు.
త్రిదండి అహోబల రామానుజ జీయర్ స్వామీజీ
కర్నూలు కల్చరల్, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామీజీ ఉద్బోధించారు. గురువారం నగర శివారులోని మామిదాలపాడులో గల గోదా రంగనాథస్వామి దేవస్థానానికి (గోదా గోకులం క్షేత్రం) ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా స్వామీజీకి గోకులం వ్యవస్థాపక అధ్యక్షుడు మారం నాగరాజ గుప్త, మేనేజింగ్ ట్రస్టీ పల్లెర్ల నాగరాజు ఘనంగా స్వాగతం పలికారు. స్వామీజీ క్షేత్రంలోని గోదా రంగనాథ స్వాముల వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రామానుజుల వారి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ క్షేత్రాన్ని నెలకొల్పిన త్రిదం డి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి 70వ తిరునక్షత్రం ఈ ఏడాది నవంబరు 8న రానున్నదన్నారు. తిరునక్షత్ర మహోత్సవాలు బుధవారంతో మొదలై ఈఏడాది అక్టోబరు 26వరకు కొనసాగుతాయన్నారు. ఈ మహోత్సవాల్లో భాగంగా ‘ఇంటింటా సత్సంగం’ నిర్వహిస్తూ రోజూ సాయంత్రం విష్ణు సహస్ర నామ పారాయణం చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో గోకులం ఇతర ప్రతినిధులు తుమ్మేపల్లి శ్రీనివాసరావు, పెరుమాళ్ల బాల సుధాకర్ పాల్గొన్నారు.