ఉత్తమ ఫలితాల కోసం కృషి చేయాలి
ABN , Publish Date - Aug 29 , 2026 | 11:46 PM
విద్యార్థులు వారికి ఇష్టమైన ఆటలు ఆడుకుంటూ చదువుపై దృష్టి మరల్చేలా చేసి ఉత్తమ ఫలితాలు సాధించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని డీఈవో సుధాకర్ సూచించారు.
డీఈవో సుధాకర్
కర్నూలు ఎడ్యుకేషన్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు వారికి ఇష్టమైన ఆటలు ఆడుకుంటూ చదువుపై దృష్టి మరల్చేలా చేసి ఉత్తమ ఫలితాలు సాధించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని డీఈవో సుధాకర్ సూచించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక సమగ్ర శిక్ష కాన్ఫరెన్స్ హాలులో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో క్రీడా పోటీల్లో రాణించిన ఐదు ఉత్తమ పాఠశాలల హెచ్‌ఎంలు, వ్యాయామ ఉపాధ్యాయులకు శాలువా కప్పి మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేసి అభినందనలు తెలిపారు. మొదటి స్థానంలో మీదివేముల జడ్పీ హైస్కూల్ నిలవగా.. తర్వాత స్థానాల్లో వరుసగా మిలిటరీ కాలనీ, పర్ల, కింగ్‌మార్కెట్, నందవరం ఉన్నత పాఠశాలలు నిలిచాయి. కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి శ్రీధర్‌బాబు, జిల్లా సమగ్రశిక్ష ప్రాజెక్టు అధికారి లోక్‌రాజు, హెచ్‌ఎంలు రాజేశ్వరమ్మ, సత్యనారాయణ, లక్ష్మీబాయి, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి కృష్ణ, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు లక్ష్మయ్య, పీఈటీలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.