Share News

ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన ఉండాలి

ABN , Publish Date - Oct 19 , 2026 | 12:31 AM

ఎన్నికల నిర్వమణ ప్రక్రియ, బాధ్యతలపై సంబంధిత సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని డిస్ట్రిక్ట్‌ జనరల్‌ అబ్జర్వర్‌ బి.అనిల్‌ కుమార్‌రెడ్డి అన్నారు.

ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన ఉండాలి
సూచనలు ఇస్తున్న జనరల్‌ అబ్జర్వర్‌ అనిల్‌ కుమార్‌రెడ్డి

జనరల్‌ అబ్జర్వర్‌ అనిల్‌కుమార్‌ రెడ్డి

కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి):ఎన్నికల నిర్వమణ ప్రక్రియ, బాధ్యతలపై సంబంధిత సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని డిస్ట్రిక్ట్‌ జనరల్‌ అబ్జర్వర్‌ బి.అనిల్‌ కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ అధికారులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను, అలాగే వెంకటరమణ కాలనీలోని నగర పాలక సంస్థ కార్యాలయంలో మేయర్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంల, ఇందిరాగంధీనగర్‌లోనిన 59,50,61 వార్డుల రిటర్నింగ్‌ అధికార కార్యాలయాల్లో నామినేషన్‌ స్వీకరణ ప్రక్రియలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియపై ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల విధులు, బాధ్యతలను ఎన్నిక లసంఘం హ్యండ్‌బుక్‌ మార్గదర్శకాల ప్రకారం సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. నగర పాలక కమిషనర్‌ చల్లా ఓబులేసు మాట్లాడుతూ అథెనా పాఠశాలలో బ్యాలెట్‌ బాక్సులను తీసుకుని.. పోలింగ్‌ కేంద్రాల్లో ఉపయోగించి తిరిగి అప్పగించేంత వరకు ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సామగ్రి వినియోగం, పోలింగ్‌ నిర్వహణ, ఎన్నికల విధివిధానాలపై పూర్తి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మేయర్‌ రిటర్నింగ్‌ అధికారి కె.వేణుగోపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2026 | 12:31 AM