సైబర్ మోసాలతో అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Aug 25 , 2026 | 11:56 PM
సైబర్ మోసాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత పాటిల్ అన్నారు.
ఎస్పీ విక్రాంత పాటిల్
కర్నూలు క్రైం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): సైబర్ మోసాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత పాటిల్ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటో రియంలో జరిగిన సమావేశంలో జిల్లా ప్రజల భద్రత, అత్యవసర సేవలు, మహిళలు, చిన్న పిల్లలపై నేరాల నివారణ చట్టాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన పలు అవగా హన పోస్టర్లను ఆయన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణలో పోలీసులతో పాటు ప్రజల భాగస్వామ్యం, అవగాహన ఎంతో కీలకమన్నారు. చిన్నారుల భద్రత కోసం చైల్డ్ హెల్ప్‌లైన 1098, మహిళల రక్షణ కోసం డయల్ 112, 181, 1091ను సంప్రదించాలన్నారు. అలాగే సైబర్ నేరాలకు 1930 హెల్ప్‌లైనతో పాటు సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. సోష ల్ మీడియా సమస్యలపై సైబర్ మిత్ర 9121211100, సోషల్ మీడి యా సెల్ 9121101103ను, మత్తు పదార్తాల నియంత్రణకు 1972ను సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే మొబైల్ పోన అపహరణకు గురై నప్పుడు సీఈఐఆర్ పోర్టల్‌ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో అడిషినల్ ఎస్పీ హుస్సేనపీరా, డీఎస్పీలు వెంకట్రామయ్య, వెంకట రమణ, దుర్గాప్రసాద్, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.