Share News

వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Sep 08 , 2026 | 11:36 PM

మలేరియా, డెంగీ, చికున గున్యా తదితర వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వర్లు అన్నారు.

వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
మాట్లాడుతున్న జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వర్లు

జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వర్లు

ఓర్వకల్లు, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): మలేరియా, డెంగీ, చికున గున్యా తదితర వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండలంలోని హుశేనాపురం పీహెచసీ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. పీహెచసీలోని ల్యాబ్‌, రికార్డులు పరిశీలించారు. మెడికల్‌ ఆఫీసర్‌ డా.రేఖ ఆధ్వర్యంలో నిర్వహిం చిన ఆశా డే సమావేశంలో ఆయన పాల్గొన్ని మాట్లాడారు. ఎల్‌సీడీసీ సర్వేపై ఆశా కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ నెల 11 నుంచి 24వ తేదీ వరకు నిర్వ హించే సర్వేలో ఇంటింటికీ వెళ్లి స్పర్శ లేని రాగి రంగు మచ్చలు ఉన్న వారిని గుర్తించాలన్నారు. సర్వే చేసిన ప్రతి ఇంటికి మార్కింగ్‌ వేయాలన్నారు. మలేరియా, డెంగీ, చికున గున్యా, మెదడువాపు వ్యా దుల లక్షణాల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. కార్యక్ర మంలో ఎంపీహెచవో ఈవో విలియమ్‌ రాబర్ట్‌, సూపర్‌వైజర్లు ప్రకాష్‌ రావు, శిలువ జ్యోతి, ఏఎనఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - Sep 08 , 2026 | 11:36 PM