Share News

రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి

ABN , Publish Date - Nov 27 , 2026 | 12:14 AM

పౌరులు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని కలెక్టర్‌ ఏ. సిరి తెలిపారు.

రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి
ప్రతిజ్ఞ చేస్తున్న కలెక్టర్‌, అధికారులు

కర్నూలు కలెక్టరేట్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): పౌరులు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని కలెక్టర్‌ ఏ. సిరి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కలెక్టర్‌ భారత రాజ్యాంగ పీఠికను చదివి అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26న రాజ్యాంగ సభ ఆమోదించిందని, 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రావు, డీఈవో సుధాకర్‌, సర్వశిక్ష అభియాన్‌ పీవో లోక్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2026 | 12:14 AM