Share News

వారం రోజులకోసారి..

ABN , Publish Date - Jan 11 , 2026 | 11:10 PM

మండలంలోని సులువాయి గ్రామంలో వారం రోజులకు ఓసారి తాగునీటిని అధికారులు సరఫరా చేస్తున్నారు.

వారం రోజులకోసారి..
తోపుడుబండ్లపై నీరు తెచ్చుకుంటున్న సులువాయి గ్రామస్తులు

తోపుడు బండ్ల పై నీరు తెచ్చుకుంటున్న గ్రామస్థులు

హొళగుంద, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని సులువాయి గ్రామంలో వారం రోజులకు ఓసారి తాగునీటిని అధికారులు సరఫరా చేస్తున్నారు. దీంతో గ్రామంలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. కొళాయిలకు నీటి సరఫరా లేదు. దీంతో కిలోమీటర్ల దూరంలో ఉన్న నీటి ట్యాంకుల వ ద్దకు వెళ్లి తోపుడుబండ్లపై నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సమస్యను పరిష్కరించాలని పలుమార్లు పంచాయతీ అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని అరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని స్థాని కులు కోరుతున్నారు. ఈ విషయం పై డిప్యూటీ ఎంపీడీవో చక్రవర్తిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా నీటిసమస్య పరిష్కరిస్తామన్నారు.

Updated Date - Jan 11 , 2026 | 11:10 PM