Share News

అధికారులు సమన్వయంతో పనిచేయండి

ABN , Publish Date - Nov 17 , 2026 | 10:57 PM

జనగణన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు.

అధికారులు సమన్వయంతో పనిచేయండి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : జనగణన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జనగణన కార్యకలాపాల నిర్వహణపై జిల్లా, డివిజనల్‌ సెన్సస్‌ అధికారులు, ఛార్జ్‌ ఆఫీసర్లు, వారికి సహాయకులుగా వ్యవహరించే డీఏవోలు, ఏఎ్‌సవోలకు నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని పలు సూచనలు చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జనగణన ప్రధానంగా రెండు దశల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి దశలో హౌస్‌ లిస్టింగ్‌ ఆపరేషన్స్‌, రెండో దశలో పాపులేషన్‌ ఎన్యుమరేషన్‌ ద్వారా జనాభా వివరాలను సేకరిస్తానని వివరించారు. జనగణన ప్రక్రియను కంప్యూటరైజ్డ్‌ అప్లికేషన్ల ద్వారా నిర్వహిస్తున్నందున సంబంధిత సాఫ్ట్‌వేర్‌, డిజిటల్‌ విధానాలపై పట్టు సాధించాలన్నారు. స్వీయ జనగణన ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. శిక్షకులు శ్రీనివాసరావు, విష్ణు మాధురి, సుస్మిత పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2026 | 10:57 PM