Share News

జీడీపీని పరిశీలించిన అధికారులు

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:04 AM

గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ)ని స్టేట్‌ ఎక్స్‌ఫర్ట్‌ టీం సభ్యులు కృష్టా రివ ర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు మాజీ చైర్మన్‌ పరమేశ్‌, రిటైర్డ్‌ ఈఈ లక్ష్మిరెడ్డి, డీఈ శ్రీకాంత్‌ మంగళవారం పరిశీలించారు.

జీడీపీని పరిశీలించిన అధికారులు
ప్రాజెక్టును పరిశీలిస్తున్న ఎక్స్‌ఫర్ట్‌ టీమ్‌ సభ్యులు

గేట్లకు రంగు వేయకపోవడంపై అసంతృప్తి

గోనెగండ్ల, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ)ని స్టేట్‌ ఎక్స్‌ఫర్ట్‌ టీం సభ్యులు కృష్టా రివ ర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు మాజీ చైర్మన్‌ పరమేశ్‌, రిటైర్డ్‌ ఈఈ లక్ష్మిరెడ్డి, డీఈ శ్రీకాంత్‌ మంగళవారం పరిశీలించారు. గేట్లు అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయా? వాటిలో ఏమైనా సమస్యలున్నాయా? అని జీడీపీ ఏఈ మహుమ్మద్‌ ఆలీని అడిగి తెలుసుకున్నారు. గేట్ల వీల్స్‌ పనితీరును పరిశీలించారు. గేట్ల కింద నుంచి ఏమైనా లీకేజీలున్నాయా? ప్రస్తుతం ప్రాజెక్టులో ఎన్ని టీఎంసీల నీరు ఉందని అని ఏఈ ప్రశ్నించారు. ఇందుకు ఆయన మాట్లాడుతూ ఆరు గేట్లలో అన్ని పనిచేస్తున్నాయని, ఎలాంటి సమస్యలు లేవని వివరించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 2.2 టీఎంసీ ల నీరు ఉందని తెలిపారు. మూడేళ్ల క్రితం ప్రాజెక్టు ఎత్తు ఒక మీటర్‌ పెంచేందుకు నిధులు విడుదలయ్యాయని వివరించారు. ప్రాజెక్టు ఎత్తును పెంచి 4.5 టీఎంసీల నుంచి 5.5 టీఎంసీల నీటి నిల్వ చేసేందుకు పనులు జరిగాయన్నారు. ప్రాజెక్టు గేట్లకు రంగులు వేయకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌కు బిల్లులు అందక పోవడంతో ఆపని పెండింగ్‌లో ఉందని, బిల్లు విడుదలైన వెంటనే పూర్తి చేస్తామని ఏఈ వారికి తెలిపారు.

Updated Date - Oct 14 , 2026 | 12:04 AM