Share News

అధికారులు సమష్టిగా పని చేయాలి

ABN , Publish Date - Jun 30 , 2026 | 11:42 PM

సమస్యల పరిష్కారానికి అధికారులు నిరంతరం అధికారులు సమిష్టిగా పనిచేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి కోరారు.

అధికారులు సమష్టిగా పని చేయాలి
మాట్లాడుతున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారానికి అధికారులు నిరంతరం అధికారులు సమిష్టిగా పనిచేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి కోరారు. మంగళవారం. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను మంత్రి క్యాంపు కార్యాలయంలో రోడ్లు, భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి స్వయంగా స్వీకరించారు. వివిధ గ్రామాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు, బాధితులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అఽధికారులు మంత్రి క్యాంపు కార్యాలయానికి తరలివచ్చి సమస్యలను మంత్రికి విన్నవించారు. ప్రజలు, బాఽధితుల వినతులు స్వీకరించి అప్పుటికప్పుడే కొన్ని సమస్యలను అధికారులకు ఫోన్‌లు చేసి పరిష్కరించారు. కొన్ని సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కరించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పొలం వివాదాలు , వ్యక్తిగత సమస్యలు మంత్రి దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పవద్దని, అలాంటి అఽధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రజలకు సేవలందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు

Updated Date - Jun 30 , 2026 | 11:42 PM