అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Oct 27 , 2026 | 11:13 PM
ఆర్నబ్ తుఫాన్‌పై రా ష్ట్రంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ఆర్నబ్ తుఫాన్‌పై రా ష్ట్రంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. బనగానపల్లె మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సులో ఆర్‌ఆండ్‌బీ శాఖాధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యవేక్షణకు 57 మంది నోడల్ అధికారులు, 24 గంటలు సేవలందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. 614 ప్రమాదకర సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించా మన్నారు. రహదారులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా రహదారులు దెబ్బతిన్న వెంటనే మరమ్మతులు చేప ట్టి రాకపోకలను పునరుద్ధరించాలని ఆదేశించారు. రాష్ట్ట వ్యాప్తంగా 53 కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు. కల్వర్టులు, వంతెనల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఫీల్డు ఇంజనీర్ల సెలవులను రద్దు చేసినట్లు మంత్రి తెలిపారు. ఆర్‌అండ్‌బీ శాఖ రాష్ట్ర కార్యదర్శి కోనశశిధర్, ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు శేషుకుమార్, రామచ్రంద, సీఈలు, ఎస్‌ఈలు పాల్గొన్నారు.