అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Oct 24 , 2026 | 11:58 PM
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ నూరల్ ఖమర్ సూచించారు.
జేసీ నూరల్ ఖమర్
మంత్రాలయం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ నూరల్ ఖమర్ సూచించారు. మంత్రాలయంలో ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియను శనివారం ఆదోని ఆర్డీవో అరుణాదేవితో కలిసి పరిశీలించారు. ఎంపీటీసీ నామినేషన్ పరిశీలనలో విధి విధానాలు, నియమ నింబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎన్నికల అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. జేసీ మాట్లాడుతూ అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సంబంధిత ఫార్మట్‌లో నిబంధనల ప్రకారం సరిచూసుకోవాలని, ఎన్నికల అధికారుల నుంచి ఎటువంటి తప్పిదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించరు. ఎన్నికల అధికారులు బాలవర్ధిని రాజు, నూర్జహాన్, లోకేశ్వర్‌రెడ్డి, ఉపేంద్రరెడ్డి, జీకే గురురాజరావు, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.