వనదేవతలకు పట్టువస్త్రాల సమర్పణ
ABN , Publish Date - Feb 01 , 2026 | 11:53 PM
తెలంగాణ ప్రఖ్యాతి గాంచిన సమ్మక్క సారలక్క గిరిజన జాతరకు శ్రీశైలం చెంచు భక్తులు తరలివెళ్లారు.
శ్రీశైలం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రఖ్యాతి గాంచిన సమ్మక్క సారలక్క గిరిజన జాతరకు శ్రీశైలం చెంచు భక్తులు తరలివెళ్లారు. ఆదివారం శ్రీశైలం ట్రస్ట్‌బోర్డు సభ్యురాలు గంగమ్మ, కొమరంభీం ఆదివాసీ చెంచు గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు వై. ఆశిర్వాదం ఆధ్వర్యంలో మేక లబండ చెంచు భక్తులు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసుకుని పట్టువస్త్రాలు తీసుకుని వెళ్లి మేడారం వన దేవతలైన సమ్మక్క సారలమ్మకు బెల్లం కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, గాజులతో అమ్మవారి గద్దెలపై మెక్కులుగా సమర్పించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, ఈవో శ్రీనివాస రావుల సహకారంతో సుమారు 50 మందితో మేడారం జాతరకు వెళ్లినట్లు ఆశీర్వాదం తెలిపారు.