రైల్వే స్టేషన్ పరిశీలన
ABN , Publish Date - Jan 21 , 2026 | 10:34 PM
నంద్యాల రైల్వేస్టేషన్‌లో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ బుధవారం సేఫ్టీ ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు.
నంద్యాల నూనెపల్లి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): నంద్యాల రైల్వేస్టేషన్‌లో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ బుధవారం సేఫ్టీ ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు. ఇందులో భాగంగా స్టేషన్ ఆవరణలోని రన్నింగ్ రూం, క్రవ్ లాబీ, కర్క్‌లేటింగ్ ఏరియా, ఫ్లాట్ ఫాం నంబరు-1ను పరిశీలించారు. ఇన్‌స్పెక్షన్‌కు వచ్చిన ఆయనకు ముందుగా స్టేషన్ అధికారులు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం దక్షిణ మధ్య రైల్వే జోనల్ యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్ ఎ.వెంకటరంగయ్య, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దీన్, సాయిరాం రెడ్డి తదితరులు రైల్వేస్టేషన్ పరిధిలోని పలు సమస్యలపై జీఎంకు వినతులు అందజేశారు. జిల్లా రైల్వే ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, రైళ్లు సరైన సమయంలో నడపాలని, రైళ్ల కొరత తదితర ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ జోన్ సీఏవో/సీ, పీసీఈఈ, పీసీఎస్‌టీఈ, పీసీఈ, పీసీవోఎం, పీసీఎస్‌వో, సీఏఓ/సీ/ఆర్‌ఎస్‌పీ, డీఆర్‌ఎం/జీఎన్‌టీ, ఏఎస్‌సీ/జీఎన్‌టీ, ఇతర బ్రాంచ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.