లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Feb 12 , 2026 | 11:53 PM
ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలో పోస్టల్ అధికారులు ఫిబ్రవరి, మార్చి నెలల లక్ష్యాలను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా సూపరింటెండెంట్ అప్పలస్వామి ఆదేశించారు.
ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలో పోస్టల్ అధికారులు ఫిబ్రవరి, మార్చి నెలల లక్ష్యాలను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా సూపరింటెండెంట్ అప్పలస్వామి ఆదేశించారు. గురువారం ఆళ్లగడ్డ పోస్టల్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీచేసి అధికా రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఇటీవల మైరోల్ మాడల్ అనే అంశంపై వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనప రిచిన విశ్వశాంతి, పేరాయిపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు మెమెంటో ఇచ్చి అభినందించారు. పోస్టల్ అధికారులు గురువయ్య, జనార్దన్, భాస్కరరావు, పెద్దరాజు, సిబ్బంది పాల్గొన్నారు.