Share News

మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి

ABN , Publish Date - Aug 22 , 2026 | 11:32 PM

బాలలకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి వార్డెన్లను ఆదేశించారు.

మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి
ప్రసంగిస్తున్నబి.లీలా వెంకట శేషాద్రి

న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి

కర్నూలు లీగల్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): బాలలకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి వార్డెన్లను ఆదేశించారు. శనివారం నగరంలోని ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలను ఆయన తనిఖీ చేశారు. వెంకటశేషాద్రి బాలలకు వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. బాలలకు ఏమైనా సమస్యలు ఉంటే హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 15100ను కాల్‌ చేయాలని ఆయన విద్యార్థులను కోరారు.

Updated Date - Aug 22 , 2026 | 11:32 PM