Share News

పెండింగ్‌ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Oct 07 , 2026 | 11:48 PM

22ఏ కి సంబంధించి 15 రోజులకు మించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎ.సిరి ఆర్డీవోలను, తహసీల్దార్లను ఆదేశించారు.

పెండింగ్‌ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ సిరి

కర్నూలు కలెక్టరేట్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): 22ఏ కి సంబంధించి 15 రోజులకు మించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎ.సిరి ఆర్డీవోలను, తహసీల్దార్లను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్‌ హాలులో బుధవారం రెవెన్యూ అంశాలపై ఆర్డీవోలతో, తహసీల్దార్లతో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సర్వేకి సంబంధించి ఫేజ్‌-5లో వీఆర్వో లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను కూడా వేగంగా పూర్తి చేయాలన్నారు. ఫేజ్‌-6లో 44 గ్రామాల్లో జరుగుతున్న గ్రౌండ్‌ ట్రూథింగ్‌ పనులను డిసెంబరు నాటికి పూర్తి చేయాలన్నారు.

Updated Date - Oct 07 , 2026 | 11:48 PM