తెలుగు జాతి ముద్దు బిడ్డ ఎన్టీఆర్
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:10 AM
తెలుగు జాతి ముద్దు బిడ్డ నందమూరి తారక రామారావు అని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ అన్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ
కర్నూలు అర్బన్, జనవరి 18(ఆంధ్రజ్యోతి): తెలుగు జాతి ముద్దు బిడ్డ నందమూరి తారక రామారావు అని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ అన్నారు. ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతక ముందు కలెక్టరేట్ ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, డీసీఎంఎస్ చైర్మన్ వై. నాగేశ్వరరావు యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పూల నాగరాజు యాదవ్‌లతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఆంధ్రుల ఆత్మగౌరం డిల్లీలో అభాసుపాలవుతుండగా.. ఎన్టీఆర్ తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి బైటికి వచ్చి 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారని అన్నారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో ప్రజల మద్దతు కూడగట్టారని అన్నారు. ఆయన అడుగు జాడల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాలోకేష్ తెలుగు ప్రజలకు అండగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ల డైరెక్టర్లు కొంకతి లక్ష్మీ నారాయణ, ఽనంద్యాల నాగేంద్ర, థరూర్ జేమ్స్, పోతురాజు రవి కుమార్, విజయకుమార్, అకెపోగు ప్రభాకర్, కేవీ సుబ్బారెడ్డి, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అబ్బాస్, కార్పొరేటర్లు కురువ పరమేష్, పద్మలతారెడ్డి, వి. హనుమంతరావు చౌదరి పాల్గొన్నారు.