Share News

తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్‌

ABN , Publish Date - Jan 19 , 2026 | 12:07 AM

టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక అని రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ, సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్‌
నివాళి అర్పిస్తున్న మంత్రి, నాయకులు

మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

న ంద్యాల రూరల్‌, జనవరి18(ఆంధ్రజ్యోతి): టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక అని రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ, సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. ఆదివారం నంద్యాలలో ఆయన 30 వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త పని చేయాలని కోరారు. ఆయన పెట్టిన రాజకీయ భిక్ష వల్ల తనలాంటి ఎంతో మంది సామాన్యులు రాజకీయ నాయకులుగా ఎదిగారని తెలిపారు. రూ.2లకే బియ్యం, పక్కా ఇళ్లు ఆయన కన్న కలలను ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు నేరవేరుస్తున్నారని అన్నారు. అనంతరం కార్యాలయం ఆవరణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సహాయకులకు భోజన సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రఽధాన కార్యద ర్శి ఎన్‌ఎండీ పిరోజ్‌, మార్‌్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ తులసిరెడ్డి, నాయకులు రామచంద్ర రావు, శ్రీరాములు, గుంటుపల్లి హరిబాబు, రవికృష్ణ, దస్తగిరి పాల్గొన్నారు.

Updated Date - Jan 19 , 2026 | 12:07 AM