Share News

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ

ABN , Publish Date - Jan 31 , 2026 | 11:52 PM

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పథకం కింద ఫిబ్రవరి మాసంలో జిల్లాలో అర్హులైన 2,36,675మంది లబ్ధిదారులకు రూ.103.16 కోట్లు పంపిణీ చేసినట్లు కలెక్టర్‌ ఏ.సిరి పేర్కొన్నారు.

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ
ఎన్టీఆర్‌ భరోసా పించన్లను పంపిణీ చేస్తున్న కలెక్టర్‌ డా.ఏ.సిరి

కర్నూలు కలెక్టరేట్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పథకం కింద ఫిబ్రవరి మాసంలో జిల్లాలో అర్హులైన 2,36,675మంది లబ్ధిదారులకు రూ.103.16 కోట్లు పంపిణీ చేసినట్లు కలెక్టర్‌ ఏ.సిరి పేర్కొన్నారు. శనివారం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీలో భాగంగా కొత్తపేటలో షేక్‌ గౌసియా, షేక్‌ తాహేరాలకు వితంతువు పింఛన్‌, పార్వతి, అబ్దుల్‌ మజీద్‌లకు వృద్ధాప్య, పద్మావ తికి ఒంటరి మహిళల పింఛను వారి ఇంటి వద్దకే వెళ్లి కలెక్టర్‌ అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్లను ఒక రోజు ముందుగానే పంపిణీ చేస్తోందన్నారు.

ఉపాధి కల్పనలో భాగంగా..

నవోదయం 2.0 పథకం కింద సారా తయారీ మానేసిన బంగారుపేట వాసులకు ప్రత్యా మ్నాయ ఉపాధి కల్పనలో భాగంగా కలెక్టరేట్‌లో ఆటోలు, తోపుడు బండ్లు, కాంక్రీట్‌ మిల్లర్లను ఇండియన్‌ బ్యాంకు మంజూరు చేయించి కలెక్టర్‌ ఏ.సిరితో పంపిణీ చేశారు.

Updated Date - Jan 31 , 2026 | 11:52 PM