లబ్ధిదారుల ముంగిటికే ఎన్టీఆర్ భరోసా
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:42 AM
లబ్ధిదారుల ముంగిటికే వచ్చి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు కూటమి ప్రభుత్వం అందిస్తూ అన్నివర్గాల మన్ననలు పొందుతుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
కల్లూరు, జూలై 1(ఆంధ్రజ్యోతి): లబ్ధిదారుల ముంగిటికే వచ్చి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు కూటమి ప్రభుత్వం అందిస్తూ అన్నివర్గాల మన్ననలు పొందుతుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో భాగంగా ఆమె 19వ వార్డు నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీలో పాల్గొని అర్హులకు పింఛన్లను అందజేశారు. గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజ లకు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో వార్డు ఇనచార్జ్ ప్రభాకర్ యాదవ్, నాయకులు పెరుగు పురుషోత్తంరెడ్డి, ఏపీ డైరెక్టర్ నాగముని, చాంద్‌బాషా, కరీష్, ధనలక్ష్మి, వీరేష్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు భూమి పూజ: కల్లూరు అర్బన 19వ వార్డు రామనగర్ ఆంజనేయస్వామి సమీపంలో రూ.45లక్షలు, మారుతీనగర్‌లో రూ.80 లక్షలతో డ్రైనే జీ పనులకు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి భూమిపూజ చేశారు. ఆమె మాట్లాడుతూ మంజూరైన పనులను సంబంధిత కాంట్రా కర్లు సకాలంలో నాణ్యతతో పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.