Share News

పేదల కళ్లలో వెలుగు ఎన్టీఆర్‌ భరోసా

ABN , Publish Date - Apr 02 , 2026 | 12:22 AM

ఎన్టీఆర్‌ భరోసా పింఛనతో పేదల కళ్లలో వెలుగులు నిండాయని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.

పేదల కళ్లలో వెలుగు ఎన్టీఆర్‌ భరోసా
లబ్ధిదారులకు పింఛన అందజేస్తున్న ఎమ్మెల్యే దస్తగిరి

కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి

కోడుమూరు రూరల్‌, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ భరోసా పింఛనతో పేదల కళ్లలో వెలుగులు నిండాయని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. బుధవారం కల్లపరి గ్రామంలో లబ్ధిదారులకు పింఛన సొమ్ము అందించారు. అనంతరం సర్పంచ వాడిగ రంగమ్మ చేతులమీద స్వర్ణగ్రామం భవనాన్ని రిబ్బన కట్‌ చేయించి ప్రారంభిం చారు. సర్పంచను కార్యాలయంలో కుర్చీలో ఆశీనుల గావించారు. ఎంపీడీవో రాముడు, డీఈ కర్రెన్న, ఏఈ గంగరాజు టీడీపీ నాయకు లు మల్లిఖార్జున, ఉరుకుందు, వీరన్న, కరుణాకర్‌, రామాంజనే యులు, రామచంద్ర, వెంకట రాముడు, జీవరత్నం, పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2026 | 12:22 AM