ఇక పరిషత్ పోరు..!
ABN , Publish Date - Oct 20 , 2026 | 12:22 AM
జిల్లా, మండల ప్రజా పరిషత్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సోమవారం నోటిఫికేషన్, షెడ్యూల్ విడుదల చేశారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదల
21 నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీల నామినేషన్ల స్వీకరణ
నంద్యాల, అక్టోబరు19(ఆంధ్రజ్యోతి): జిల్లా, మండల ప్రజా పరిషత్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సోమవారం నోటిఫికేషన్, షెడ్యూల్ విడుదల చేశారు. ఇప్పటికే నగర, పురపాలక సంఘాల ఎన్నికల సందడి జోరందుకుంది. కీలకమైన నామినేషన్ల ఘట్టం, పరిశీలన పూర్తి అయ్యింది. బుధవారం పుర పోరులో తలపడే అభ్యర్థులు ఎవరో తేలనుంది. తాజాగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ జారీ చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎన్నికల వేడి మొదలైంది. అభ్యర్థుల వేటలో అధికార కూటమి, ప్రతిపక్ష పార్టీలు నిమగ్నమై య్యాయి. నవంబరు 3న పల్లె పోరుకు నగారా మోగించారు. దీంతో జిల్లాలోని రాజకీయ పార్టీలతో ఆశావహుల్లో సర్వత్ర ఉత్కంఠ రేపుతోంది. దీంతో జిల్లాలోని 28 జడ్పీటీసీ, 384 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లైంది. ఆ దిశగా జిల్లా అధికార యంత్రాంగం సైతం ఆయా పనుల్లో నిమగ్నమైంది.
21 నుంచి నామినేషన్ల స్వీకరణ..
తాజా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. జిల్లాలోని ఈనెల 21 నుంచి 23వ తేది వరకు ఆయా అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ. 24న పరిశీలన, 25న తిరస్కరణకు గురైన నామినేషన్ల అప్పీళ్లు, 26వతేదిన అప్పిళ్ల పరిష్కారం, 27వ తేది వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది.
జిల్లాలో పరిస్థితి ఇలా..
జిల్లాలో నియోజకవర్గాలు : 07
జిల్లాలోని మండలాలు : 28
జిల్లాలో జడ్పీటీసీ స్థానాలు : 28
జిల్లాలో ఎంపీటీసీ స్థానాలు : 377
పోలింగ్ కేంద్రాలు : 1328
మొత్తం ఓటర్లు : 10,84,704
ఇందులో మహిళలు : 5,51,419
ఇందులో పురుషులు : 5,33,160
ఇతరులు : 125
ఎన్నికల షెడ్యూలు
వివరాలు తేది సమయం
ఆర్వో నోటిఫికేషన్ జారీ 21న ఉ.10.30 నుంచి సా.5 గంటల వరకు
నామినేషన్ల స్వీకరణకు ఆఖరు 23న సా.5 గంటల వరకు
నామినేషన్ల పరిశీలన 24న ఉ.8 గంటల నుంచి
ఆర్డీవో, కలెక్టర్కు అప్పీల్ 25న సా.5 గంటల వరకు
అప్పిలేట్ అధికారి విచారణ 26న --
ఉప సంహరణకు ఆఖరు తేది 27న మధ్యాహ్నం 3 గంటల్లోపు
అభ్యర్థుల తుది జాబితా ప్రకటన 27న మ.3 గంటలు తరువాత
పోలింగ్ తేది నవంబరు 3న ఉ.7 నుంచి సా.5 గంటల వరకు
రీపోలింగు ఏదైనా ఉంటే 4న ఉ.7 నుంచి సా.5 గంటల వరకు
ఓట్ల లెక్కింపు 5వ తేది ఉ.8.00 గంటల నుంచి
ఫలితాలు ప్రకటన ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే