కోడిగుడ్లు ఇవ్వడం లేదు సార్..!
ABN , Publish Date - Apr 22 , 2026 | 11:53 PM
హాస్టల్‌లో తమకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, కోడిగుడ్లు అందరికీ ఇవ్వడం లేదని నగర శివారులోని పెద్దపాడులో ఉన్న దామోదరం సంజీవయ్య బాలసదన్ హాస్టల్ విద్యార్థినిలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి దృష్టికి తీసుకువచ్చారు.
పెద్దపాడు బాలికల హాస్టల్ విద్యార్థినుల ఫిర్యాదు
ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి
కర్నూలు లీగల్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): హాస్టల్‌లో తమకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, కోడిగుడ్లు అందరికీ ఇవ్వడం లేదని నగర శివారులోని పెద్దపాడులో ఉన్న దామోదరం సంజీవయ్య బాలసదన్ హాస్టల్ విద్యార్థినిలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి దృష్టికి తీసుకువచ్చారు. బుధవారం ఆయన అకస్మికంగా హాస్టల్‌ను తనిఖీ చేసినప్పుడు అక్కడ ఉంటున్న బాలికలు తమ ఇబ్బందులపై ఆయనకు ఫిర్యాదు చేశారు. ఆయన న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి పిల్లలకు సరైన భోజనం అందజేసి ప్రతి ఒక్కరికి కోడిగుడ్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. బాలసదన్‌లో తగినంత సిబ్బంది ఉన్నా హాస్టల్‌లో అపరిశుభ్రత ఉండటాన్ని గమనించి మండిపడ్డారు. కార్యాలయ రిజిస్టర్లను పరిశీలించి ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పరిశుభ్రతను నెలకొల్పాలని, రికార్డులను సరైన పద్ధతుల్లో ఉంచుకోవాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. ఇదే పరిస్థితులు పునరావృతమైతే తగిన చర్యలు తీసుకోవడానికి సంబంధించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ హెల్ప్‌లైన్ నెంబర్.15100కు ఫిర్యాదు చేయాలని ఆయన పిల్లలకు సూచించారు.