Share News

‘బలవంతంగా నామినేషన్లు వేయిస్తున్నారు’

ABN , Publish Date - Oct 16 , 2026 | 11:47 PM

వైసీపీ నాయకులు మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థులచే బలవంతంగా నామినేషన్లు వేయిస్తున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆరోపించారు.

‘బలవంతంగా   నామినేషన్లు వేయిస్తున్నారు’
శిరివెళ్లలో టీడీపీలో చేరిన వారితో ఎమ్మెల్యే అఖిలప్రియ

శిరివెళ్ల, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకులు మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థులచే బలవంతంగా నామినేషన్లు వేయిస్తున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆరోపించారు. శుక్రవారం శిరివెళ్లలోని ముల్లాపేటకు చెందిన ముల్లా ఫయాజుద్దీన్‌, రవూఫ్‌, హుసేన్‌ బాషా, ఇనాయతుల్లా, సనావుల్లా, షాదాబ్‌ వైసీపీని వీడి ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరారు. వైసీపీ నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా.. ఎన్ని ప్రలోభాలు చేసినా ప్రజాబలం టీడీపీకే ఉందన్నారు. శిరివెళ్లలో రూ.2 కోట్ల అభివృద్ధి పనులు చేశామన్నారు. కన్వీనర్‌ కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శివరామిరెడ్డి, ఉపాధ్యక్షురాలు శకుంతలమ్మ, మాజీ జడ్పీటీసీ యామా గుర్రప్ప, సూరా రామ, బీ ఫిదా హుసేన్‌, బాలచంద్రుడు, వెంకట సుబ్బయ్య, మస్తాన్‌, సిద్ధిఖ్‌, రఫి ఉన్నారు.

Updated Date - Oct 16 , 2026 | 11:47 PM