Share News

ముగిసిన నామినేషన్ల పర్వం

ABN , Publish Date - Oct 19 , 2026 | 12:58 AM

డోన్‌, బేతంచెర్ల, ఆళ్లగడ్డ మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్లు వేసేందుకు చివరిరోజు కావడంతో భారీగా దాఖలు చేశారు. డోన్‌లో టీడీపీ తరపున చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా కోట్ల సుజాతమ్మ, బేతంచెర్ల నుంచి లోకేశ్‌ గౌడ్‌ అలాగే ఆళ్లగడ్డలో జనసేన నాయకులు దాఖలు చేశారు.

ముగిసిన నామినేషన్ల పర్వం
డోన్‌లో ర్యాలీ నిర్వహిస్తున్న కోట్ల సుజాతమ్మ

డోన్‌ టౌన్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రజాసేవే లక్ష్యమని కోట్ల సుజాతమ్మ అన్నారు. ఆదివారం మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. పార్టీ పరిశీలకుడు గోవర్దన్‌ రెడ్డి, విజయభట్టు, ఆంజనేయులు గౌడు, ఓంప్రకా్‌షతో కలిసి పట్టనంలో భారీ ర్యాలీ నిర్శహించారు. టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతుందన్నారు. ఎమ్మెల్యే కోట్లను ఆశీర్వదించిన విదంగానే తనను గెలిపించాలని కోరారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, ఓబులాపురం శేషిరెడ్డి, కమలాపురం మాజీ సర్పంచ్‌ రేగటి అర్జున్‌ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు సలీంధ్ర శ్రీనివాసులు యాదవ్‌, మార్కెట్‌ యార్డు చైర్‌పర్సన్‌ రాజా రేణుక, ఎన్‌ఈ సరోజ, తిరునాంపల్లి ఆలంకొండ గిరి ప్రసాద్‌ రెడ్డి, కనపకుంట మధుసూదన్‌ రెడ్డి, గోవిందరెడ్డి, సందు వెంకటరమణ ఉన్నారు.

నగర పంచాయతీ చైర్మన్‌ అభ్యర్థిగా లోకేశ్‌ గౌడ్‌

బేతంచెర్ల: నగర పంచాయతీ చైర్మన్‌ టీడీపీ అభ్యర్ధిగా లోకేష్‌ గౌడ్‌ ఆదివారం నామినేషన్‌ దాఖలు చేశారు. ముందుగా పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి ఆ పార్టీ యువ నాయకుడు కోట్ల రాఘవేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్ల నాగయ్య, బుగ్గన ప్రసన్న లక్ష్మి, పోలూరు రాఘవరెడ్డి, కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి నామినేషన్‌ దాఖలు చేశారు. అలాగే 27వ వార్డు టీడీపీ అభ్యర్థిగా సువర్ణ నామినేషన్‌ వేశారు. మండల ఇన్‌చార్జులు భాస్కర్‌ రెడ్డి, వర్ధన్‌ రెడ్డి, రామాంజనేయులు, రామగోపాల్‌, మేకల నాగరాజు, రూబెన్‌ పాల్గొన్నారు. కాగా నగర పంచాయతీ చైర్మన్‌కు 16, నామినేషన్లు రాగా, 28 వార్డులకుగాను 160 నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆర్‌వో హరి ప్రసాద్‌ తెలిపారు.

ఆళ్లగడ్డలో చివరి రోజు 103 నామినేషన్ల

ఆళ్లగడ్డ: మున్సిపల్‌ ఎన్నికలకు ఆదివారం 103 నామినేషన్లు వచ్చినట్లు ఆర్‌వో కిషోర్‌ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ 1, టీడీపీ 2, వైసీపీ 2 నామినేషన్లు ఛైర్మెన్‌ అభ్యర్తికి నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. . బీజేపీ తరపున వార్డులకు 4, కాంగ్రెస్‌ తరపున 1, టీడీపీ తరపున 98, వైసీపి 71, జనసేన 12 మంది నామినేషన్లు వేశారన్నారు. మొత్తం 186 మంది వార్డు సభ్యులుగా, 5 మంది చైర్‌పర్సన్‌కు నామినేషన్లు వేశారు. డీఎస్పీ రవికుమార్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్‌ హాల్‌లోనికి నామినేషన్‌ దాఖలు చేసే వ్యక్తి, ప్రతిపాదించే వారిని మాత్రమే లోనికి అనుమతించారు. అధిష్టానం ఆదేశాల మేరకు 12 మంది వార్డు మెంబర్లుగా నామినేషన్లు వేసినట్లు జనసేన సమన్వయ కర్త ఇరిగెల రాంపుల్లారెడ్డి తెలిపారు.

Updated Date - Oct 19 , 2026 | 12:58 AM