జోరుగా నామినేషన్లు..
ABN , Publish Date - Nov 16 , 2026 | 12:03 AM
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఆళ్లగడ్డ, చాగలమర్రి, శిరివెళ్ల, రుద్రవరం, ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాల్లో అధికారులు స్వీకరించారు. కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా మంగళవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.
మొదటిరోజే సర్పంచ్, వార్డు సభ్యులకు దాఖలు చేసిన అభ్యర్థులు..
చాగలమర్రి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): గ్రామాభివృద్ధే తన లక్ష్యమని మద్దూరు గ్రామ టీడీపీ మద్దతుదారుడైన సర్పంచ్ అభ్యర్థి వెంకటేశ్ తెలిపారు. ఆదివారం గ్రామంలో నామినేషన్ వేసిన అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు భరోసా నింపుతాయన్నారు. అంజి, ఓబన్న, సుబ్బరాయుడు, వీరయ్య, ఇమామ్‌వల్లి, సువార్త, మాబూవల్లి, ఓబులేసు పాల్గొన్నారు.
సర్పంచ్‌కు10, వార్డు సభ్యులకు 49 నామినేషన్లు..
మండలంలో క్లస్టర్ కేంద్రాల్లో సర్పంచ్‌కు 10, వార్డు సభ్యులకు 49 నామినేషన్‌లు వేసినట్లు ఎంపీడీవో తాహిర్‌హుసేన్ తెలిపారు. రాంపల్లెలో 3 సర్పంచ్, 6 వార్డులు, కేపీ తండాలో 3 సర్పంచ్, 6 వార్డులు, మద్దూరులో 2 సర్పంచ్, 7 వార్డులు, చాగలమర్రిలో 2 సర్పంచ్, 20 వార్డులు నామినేషన్ వేశారన్నారు. 17వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తామని తెలిపారు.
మొదటి రోజు 30 నామినేషన్లు
శిరివెళ్ల: మండలంలో పంచాయతీ ఎన్నికలకు సర్పంచ్ స్థానాలకు 30, వార్డు స్థానాలకు 91 నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎంపీడీవో శివ మల్లేశ్వరప్ప ఆదివారం తెలిపారు. గోవిందపల్లె, జీనేపల్లె, కోటపాడు, కామినేనిపల్లె, మహదేవపురం, వనికెందిన్నె, శిరివెళ్ల, వీరారెడ్డిపల్లె పంచాయతీల్లో సర్పంచ్ స్థానానికి 30 దరఖాస్తులు, వార్డు మెంబర్ స్థానాలకు 91 దరఖాస్తులు వచ్చాయన్నారు. నామినేషన్ల కేంద్రాలను ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్ పరిశీలించి, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ మధుసూదనను ఆదేశించారు.
సర్పంచ్‌కు15 వార్డు మెంబర్లకు 21
రుద్రవరం: మండలంలో ఆదివారం 21 పంచాయతీలకు గాను 15 సర్పంచ్ అభ్యర్ధిగా 21 వార్డుమెంబరు అభ్యర్థులుగా నామినేషన్ల దాఖలు చేసినట్లు ఎంపీడీవో భాగ్యలక్ష్మి తెలిపారు. వమొదటిరోజు సర్పంచ్ 15, వార్డు సభ్యులకు 21 మంది మొత్తం 36నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికలన నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు. మండలంలో 21 పంచాయతలకు గాను ఏడు నామినేషన్ల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆళ్లగడ్డ: మండలంలో పంచాయితీ ఎన్నికలకు ఆదివారం మొదటి రోజు 75 నామినేషన్లు దాఖలు అయినట్లు ఆర్‌వో నూర్జహాన్ తెలిపారు. 17 పంచాయితీలు, 68 వార్డులు ఉండగా సర్పంచ్, సర్పంచ్‌కు 21, వార్డులకు 54 నామినేషర్లు వేశారన్నారు.
దొర్నిపాడు: మండలంలోని 11 గ్రామ పంచాయతీలకు ఉండగా 4 క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు ఆర్‌వో నాగరాజు, ఎంపీడీవో సావిత్రి తెలిపారు. దొర్నిపాడు, చాకరాజువేముల, కొండాపురం, డబ్ల్యూ.గోవిందిన్నె గ్రామాల్లోని సచివాలయాల్లో 10 మంది సర్పంచ్‌కు 23 వార్డు మెంబర్లు నామినేషన్లు వేసినట్లు ఎంపీడీవో సావిత్రి తెలిపారు.
తొలిరోజు 67 నామినేషన్లు
ఉయ్యాలవాడ: మండలంలోని అన్ని క్లస్టర్లలో పంచాయతీ ఎన్నికలకు 67 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో నాగలక్ష్మమ్మ తెలిపారు. 20 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌కు 20 మంది, 170 వార్డులకు గాను 47 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారన్నారు. సుద్దమల్ల సర్పంచ్ అభ్యర్థులకు 2, వార్డులకు 7 గురు, హరివరం సర్పంచ్‌లకు ఇద్దరు, కొండుపల్లె సర్పంచ్‌కు ఇద్దరు, వార్డుకు 4, కాకరవాడ, పుచ్చకాయపల్లెలో సర్పంచ్‌కు 1 చొప్పున, తుడుమలదిన్నెలో సర్పంచ్‌కు 3 వార్డులకు 9, పెద్దయమ్మనూరు సర్పంచ్‌కు 3, వార్డులకు 15, ఆర్.జంబులదిన్నెలో సర్పంచ్‌కు 3 వార్డులకు 4, సర్వాయిపల్లెలో సర్పంచ్‌కు 3, వార్డులకు 8 నామినేషన్లు వచ్చాయన్నారు.