Share News

సం'క్షేమం కాదు'

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:26 AM

జలదుర్గం ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహం నిర్వాహణ అస్తవ్యస్థంగా ఉంది. వార్డెన్‌ చుట్టపుచూపుగా విధులకు హాజరవుతున్నట్లు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోఎపిస్తున్నారు. ఇక్కడ 80 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీరు జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు.

సం'క్షేమం కాదు'
వసతి గృహం ఆవరణలో పిచ్చి మొక్కలు, కంప

పత్తాలేని వార్డెన్‌, ఆవరణలో ముళ్లకంప, పిచ్చిమొక్కలు

మరుగుదొడ్ల నుంచి దుర్వాసన.. జలదుర్గం ఎస్సీ హాస్టల్‌ దుస్థితి

ప్యాపిలి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): జలదుర్గం ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహం నిర్వాహణ అస్తవ్యస్థంగా ఉంది. వార్డెన్‌ చుట్టపుచూపుగా విధులకు హాజరవుతున్నట్లు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోఎపిస్తున్నారు. ఇక్కడ 80 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీరు జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు.

పత్తాలేని వార్డెన్‌

ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వార్డెన్‌ కర్నూలులో నివాసముంటూ నెలలో కేవలం రెండుమూడు రోజులు మాత్రమే వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వాచ్‌మెన్‌, వంటమనిషే వార్డెన్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తుంది.

నాణ్యతలేని భోజనం

తమకు వడ్డించే భోజనంలో నాణ్యత లేదని హాస్టల్‌ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మెనూ పాటించడం లేదని ఆహారం కూడా తగినంత ఇవ్వడం లేదంటున్నారు. పౌష్టికాహారం లోపించడంతో ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

విష పురుగుల సంచారం

వసతి గృహం ఆవరణలో పిచ్చిమొక్కలు ఉండటంతో రాత్రివేళ విషపురుగులు సంచరిస్తున్నాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. బయటికి రావాలంటేనే భయపడుతున్నామని మరుగుదొడ్ల నిర్వాహణ లేకపోవడంతో దుర్వాస వస్తోందంటున్నారు. వార్డెన్‌ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఉన్నతాధికారులు స్పందించి జలదుర్గం వసతి గృహాన్ని తనిఖీచేసి సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై వార్డెన్‌ శ్రీనివాసులును ఫోన్‌లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.

Updated Date - Oct 09 , 2026 | 12:26 AM