Share News

సం’క్షేమం కాదు’

ABN , Publish Date - Aug 06 , 2026 | 12:18 AM

: మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ బాలికల హాస్టల్‌లో 3 నుంచి 10వ తరగతి వరకు 98 మంది బాలికలు ఉంగా, 56 మంది మాత్రమే హాస్టల్‌కు వసతి పొందుతున్నారు. అయితే వసతులు లేకపోవడంతో బాలికల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది.

సం’క్షేమం కాదు’
తలుపులు లేని స్నానపు గదులు

తలుపులు లేని మరుగుదొడ్లు

ప్రహరీ లేకపోవడంతో ప్రశార్థకంగా బాలికల భద్రత

చాగలమర్రి బీసీ బాలికల హాస్టల్‌ దుస్థితి

చాగలమర్రి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ బాలికల హాస్టల్‌లో 3 నుంచి 10వ తరగతి వరకు 98 మంది బాలికలు ఉంగా, 56 మంది మాత్రమే హాస్టల్‌కు వసతి పొందుతున్నారు. అయితే వసతులు లేకపోవడంతో బాలికల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది.

సరిగా లేని ప్రహరీ

హాస్టల్‌ చుట్టూ ప్రహరీని నిర్మిచంకుడా కేవలం కొనిన బండలు పాతి వదిలేశారు. దీంతో ఇక్కడ వసతి పొందే బాలికల భధత్ర ప్రశ్నార్థకంగా మారింది. భోజన సమయంలో ప్లేట్‌లు శుభ్రం చేసుకునేందుకు ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫాంపై బండలు లేచిపోయి మురుగు నిలుస్తోంది. దుర్వాసనను భరించలేక విద్యార్థులును ఆరుబయటనే తినాల్సి వస్తోంది. వర్షం వస్తే వరండాలోనే తినాల్సి వస్తోంది.

వార్డెన్‌ సొంత నిధులతో మరమ్మతులు..

హాస్టల్‌లో ఫ్యాన్లు, విద్యుత్‌ మోటార్‌ మరమ్మతులకు సొంత నిధులు రూ.58వేలు ఖర్చు చేసినట్లు వార్డున్‌ తెలిపారు. అయితే ఇంతవరకు బిల్లులు రాలేదని అధికారులు సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. అధికారులు స్పందించి హాస్టల్‌లో సమస్యలను పరిష్కరించాలని విద్యార్తినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

తలుపులు లేని మరుగుదొడ్లు

హాస్టల్‌లో ఏర్పాటు చేసిన బాత్రూమ్‌లు, మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. కొన్నింటికి తలుపులు లేవు, దీంతో స్నానం చేసేయందుకు బాలికలు భయపడుతున్నారు. నూతనంగా టాయిలెట్లు ఏర్పాటు చేసినా, నిర్వహణ లేకపోవడంతో అవి దుర్వాసన వస్తున్నాయి.

ప్రతిపాదనలు పంపాం

హాస్టల్‌లో సమస్యలను పరిష్కరించాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. మరుగుదొడ్లు, బాత్రూమ్‌ డోర్లు దెబ్బతిన్నాయని, డ్రైనేజీ సరిగా లేదని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. నిధులు రాగానే సమస్యలను పరిష్కరిస్తాం. - మహేశ్వరి, వార్డెన్‌

Updated Date - Aug 06 , 2026 | 12:18 AM