Share News

సం'క్షేమం కాదు'

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:09 AM

బాలుర వసతి గృహాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పట్టణంలోని బేతంచెర్ల రోడ్డులో పక్కపక్కనే ఎస్సీ, బీసీ, బాలుర హాస్టల్స్‌ ఉన్నాయి. ఎస్సీ హాస్టల్‌లో 88 మంది, బీసీ హాస్టల్‌లో 158 మందికిపైగా విద్యార్థులు వసతి పొందుతూ చదువుతున్నారు.

సం'క్షేమం కాదు'
డోన్‌ ఎస్సీ బాలుర సంక్షేమ హాస్టల్‌

డోన్‌ బీసీ, ఎస్సీ వసతి గృహాల్లో పెచ్చులూడిన భవనాలు

కంపు కొడుతున్న టాయిలెట్లు

విరిగిపోయిన వాకిళ్లు, కిటికీలు

డోన్‌ రూరల్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): బాలుర వసతి గృహాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పట్టణంలోని బేతంచెర్ల రోడ్డులో పక్కపక్కనే ఎస్సీ, బీసీ, బాలుర హాస్టల్స్‌ ఉన్నాయి. ఎస్సీ హాస్టల్‌లో 88 మంది, బీసీ హాస్టల్‌లో 158 మందికిపైగా విద్యార్థులు వసతి పొందుతూ చదువుతున్నారు.

ఎస్సీ హాస్టల్‌ దుస్థితి..

విద్యార్థుల కోసం పది బాత్‌రూమ్‌లు, టాయిలెట్లు ఏర్పాటు చేశారు. అయితే అవి నిర్వహణ లేక అధ్వాన్నస్థితిలో పాచిపట్టి కంపు కొడుతున్నాయి. దీంతో విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే హాస్టల్‌ లోపలి భాగంలో ఉన్న గదుల వాకిళ్లు విరిగి అధ్వాన్నంగా ఉన్నాయి. భవనం పైకప్పు పెచ్చులూడుతుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

బీసీ హాస్టల్‌లో..

బీసీ బాలుర సంక్షేమ హాస్టల్‌లో 158 మంది విద్యార్థులు వతసి పొందుతున్నారు. అయితే ఇక్కడా అదే పరిస్థితి. ఉంటున్న వార్డెన్‌ గది పైకప్పు పెచ్చులుడుతోంది. రెండు హాస్టల్స్‌కు ఒకే వార్డెన్‌ విధులు నిర్వహిస్తున్నారు. ఎస్సీ హాస్టల్‌కు వార్డెన్‌ బీసీ హాస్టల్‌కు కూడా ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. ఎస్సీ హాస్టల్‌ విద్యార్థులకు రూ.25 లక్షల నిధులతో నిర్మిస్తున్న డైనింగ్‌ హాల్‌ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఉన్నతాధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

ప్రతిపాదనలు పంపాం

ఎస్సీ బాలుర హాస్టల్‌లో సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతుల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. అధికారుల నుంచి అనుమతి రాగానే సమస్యలు పరిష్కరిస్తాం. - ఎన్‌.మధు, వార్డెన్‌, ఎస్సీ సంక్షేమ హాస్టల్‌, డోన్‌

Updated Date - Jul 01 , 2026 | 12:09 AM