ఎండిపోయి'నది'
ABN , Publish Date - Aug 22 , 2026 | 12:03 AM
తుంగభద్ర నదిలో డేంజర్ బెల్స్ మోగుతున్నా యి. నిత్యం నీటితో కళకళలాడే తుంగభద్ర నది ఎల్‌నినో ప్రభావంతో ఎండుముఖం ప ట్టింది. వర్షాలు లేకపోగా ఎగువ నుంచి నీటి ప్రవాహం నిలిచి పోవటంతో రోజురోజుకు నది కళావిహీనంగా మారింది.
తుంగాతీరంలో డేంజర్ బెల్స్
ఎల్‌నినో ప్రభావంతో కురువని వర్షాలు
సాగునీరు అందక నెర్రెలిచ్చిన వరి పొలాలు
చెలిమిల నుంచి నీరు తెచ్చుకుంటున్న రైతులు
నాగలదిన్నె, గురుజాల ప్రాంతాల్లో రాళ్లుతేలిన తుంగభద్ర నది
ఎమ్మిగనూరు, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): తుంగభద్ర నదిలో డేంజర్ బెల్స్ మోగుతున్నా యి. నిత్యం నీటితో కళకళలాడే తుంగభద్ర నది ఎల్‌నినో ప్రభావంతో ఎండుముఖం ప ట్టింది. వర్షాలు లేకపోగా ఎగువ నుంచి నీటి ప్రవాహం నిలిచి పోవటంతో రోజురోజుకు నది కళావిహీనంగా మారింది. నదిపై ఆధారపడిన సాగునీటి ఎత్తిపోతల పథకాలన్నీ నిలిచిపోయాయి. నదీతీరం వెంబడి మంత్రాలయం, నదికైరవాడి,చిన్నకొత్తిలి, పెద్దకొత్తిలి, పల్లె, గంగవరం, నాగలదిన్నె, గురజాల, రాయచోటి గ్రామాల పరిధిలో దాదాపు ఎనిమిది వేల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగుచేశారు. వరి పైరుకు పది,పదిహేను రోజుల క్రితం వరకు నదిలో నీరు అందాయి. వారం రోజులుగా నదిలో నీరు పూర్తిగా అడుగంటిపో వడంతో వరి పైరుకు సాగు నీరు అందడం గగనంగా మారింది. రాయచోటి, గురజాల, నాగలదిన్నె ప్రాంతాల్లో ఇప్పటికే నీరు అందడం నిలిచిపోవడంతో వరి పొలాలన్నీ నెర్రలు ఇవ్వడమే గాక వరి పైరు ఎండుముఖం పడుతోంది. ఇదే పరిస్థితి మరో ఇలాగే కొనసాగితే వరి పైరంతా ఎండిపోవడం ఖాయమని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
గుంతల్లో మాత్రమే నీరు..
జలకళతో కళకళలాడాల్సిన తుంగభద్ర నది క్రమేణా ఎండుతూ వస్తోంది. అక్కడక్కడ గుంతలు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే నీరు నిలిచి ఉన్నాయి. ఖరీ్‌ఫలో వర్షాలు సమృద్ధిగా వర్షాలు కురిసి నదిలో పుష్కలంగా నీటి పారుదల ఉంటుందని నదీతీర ప్రాంత రైతులు ఎంతో ఆశతో రెండు పంటలు సాగు చేయవచ్చని అప్పులుచేసి మరి పంటలు సాగు చేశారు. రైతులంతా తీరంలో 90శాతం వరి ఎకరాకు వేల రూపా యలు పెట్టుబడులు పెట్టి సాగుచేశారు. ఇప్పుడు నదిలో నీరు ఇంకిపోయి పైరుకు నీరు అందటం నిలిచిపోయింది.
తాగునీటికి కటకటే
నదీతీర గ్రామాల్లో తాగునీటికి కటకట ఏర్పడింది. వారం పదిరోజులుగా నదిలో నీటి లభ్య త పూర్తిగా నిలిచిపోవటంతో ఆయా గ్రామాలకు తాగునీరు అందించే పథకాలు నిలిచి పోయాయి. దీంతో గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోవటంతో ప్రజలు నదిలో చెలిమలను తవ్వుకొని నీటిని తెచ్చుకుంటున్నారు.
టీబీ డ్యాంపైనే ఆశలు
తుంగభద్ర నదీతీరంలో వరి పైరును సాగుచేసిన రైతులు నదిలో నీటిపై ఆధారపడి సాగుచేయటం ఆనవాయితీ. నది ఎగువనుంచి నీరు వస్తుందన్న ఆశతో రైతులు వరి పం టను సాగుచేశారు. ఎగువన సైతం అంతకంతకే వర్షాలు కురువటంతో దిగువకు నీటి పా రుదల నిలిచిపోయింది. ప్రస్తుతం తుంగభద్ర(టీబీ) డ్యాం నుంచి నదికి నీటిని విడుదల చేస్తే తప్ప తమ పైరు బతికే పరస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పదెకరాల్లో వరి సాగు చేశా
తుంగభద్ర నదినీటిపై ఆధారపడి ఎప్పటిలాగానే ఈఏడాది కూడా పదెకరాల్లో వరి సాగు చేశా. పదిహేను రోజులుగా పైరుకు నీరు అందటం లేదు. కొనసాగితే పైరు ఎండిపోయే అవకాశముంది. భారీగా నష్టపోవాల్సి వస్తుంది. - శివారెడ్డి, రైతు, గురుజాల, నందవరం మండలం