Share News

నిరుపయోగంగా పశువుల తొట్లు

ABN , Publish Date - Apr 05 , 2026 | 12:07 AM

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పశువులు, పక్షుల దాహార్తి తీర్చేందుకు ఉపాఽధి, వాటర్‌ షెడ్‌ పథకాల కింద గ్రామ పరిసరాలు, కొండల్లో తొట్లు నిర్మించారు.

నిరుపయోగంగా పశువుల తొట్లు
నాయినిపల్లె రహదారిలో నీరులేని తొట్టి

నీరులేక అల్లాడుతున్న మూగజీవాలు, పక్షులు

కొలిమిగుండ్ల, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పశువులు, పక్షుల దాహార్తి తీర్చేందుకు ఉపాఽధి, వాటర్‌ షెడ్‌ పథకాల కింద గ్రామ పరిసరాలు, కొండల్లో తొట్లు నిర్మించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. పభుత్వ లెక్కల ప్రకారం మండలంలో ఆవులు, గేదెలు 12వేలకు పైగా ఉన్నాయి. గొర్రెలు, మేకలు కలుపుకొని 1లక్షకు పైగా ఉన్నట్లు సమాచారం. ఇవికాక గ్రామాలు, గ్రామ పరిసరాల్లో జీవించే కుక్కలు,గాడిదలు, జింకలు, దుప్పులు, కుందేళ్లు, నెమళ్లు తదితర జీవులు వేలాదిగా జీవిస్తున్నాయి. అధికారులు స్పందించి, తొట్లను నీటితో నింపి మూగజీవాలను కాపాడాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

Updated Date - Apr 05 , 2026 | 12:07 AM