గురుకులంలో దాహం.. దాహం
ABN , Publish Date - Mar 10 , 2026 | 01:16 AM
పట్టణంలోని రవ్వలకొండ మహాత్మాగాంధీ జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాలలో తాగునీరు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు
రెండు వారాలుగా విద్యార్థుల ఇబ్బందులు
బనగానపల్లె, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని రవ్వలకొండ మహాత్మాగాంధీ జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాలలో తాగునీరు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. హాస్టల్‌లో 230 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రెండు వారాలుగా నీరు రాలేదని, స్నానాలు, కాలకృత్యాలకు నిత్యం ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఇబ్బంది పడుతున్నా ప్రిన్సిపాల్ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తాము ఎస్సార్బీసీ కాల్వ, బోర్ల వద్దకు, ఆలయాల వద్దకు వెళ్లి స్నానాలు చేస్తున్నట్లు విద్యార్థులు వాపోతున్నారు. కాల్వలో స్నానం చేసే పమయంలో ప్రమాదం చోటుచేసుకుంటే ఎవరు బాధ్యులని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈవిషయమై ప్రిన్సిపాల్ బాలాజీ మాట్లాడుతూ హాస్టల్‌లో మోటారు చెడిపోవడంతో రెండు వారాలుగా మంచినీటి సమస్య ఉత్పన్నమైందని, విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.