Share News

చుక్క నీరుంటే ఒట్టు

ABN , Publish Date - Mar 02 , 2026 | 12:11 AM

మూగజీవాల దాహారి తీర్చేందుకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన పశువుల నీటి తొట్లు అలంకార ప్రాయంగా మారాయి. ఈ తొట్లను నీటితో నింపేవారే లేరు. దీంతో మూగజీవాలకు నీరు కరువైంది. వేసవి రావడంతో వాటికి నీరు దొరికే అవకాశం లేకుండా పోయింది.

చుక్క నీరుంటే ఒట్టు
ఓర్వకల్లులో నిరుపయోగంగా నీటితొట్టి

నిరుపయోగంగా నీటితొట్లు

దాహంతో తల్లడిల్లుతున్న మూగజీవాలు

ఓర్వకల్లు, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): మూగజీవాల దాహారి తీర్చేందుకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన పశువుల నీటి తొట్లు అలంకార ప్రాయంగా మారాయి. ఈ తొట్లను నీటితో నింపేవారే లేరు. దీంతో మూగజీవాలకు నీరు కరువైంది. వేసవి రావడంతో వాటికి నీరు దొరికే అవకాశం లేకుండా పోయింది. మండలంలోని ఓర్వకల్లు, కన్నమడకల, నన్నూరు, ఉయ్యలవాడ, ఉప్పలపాడు, శకునాల, తిప్పాయపల్లె, తదితర గ్రామాల్లో 25 నీటితొట్లు ఉన్నాయి. వాటి నిర్మాణానికి ఉపాధి హామీ పథకం ద్వారా గత టీడీపీ ప్రభుత్వంలో రూ.5 లక్షలు ఖర్చు చేసింది.ఒక్కో తొట్టి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.30 వేలు కేటాయించింది.

పట్టించుకోని పాలకవర్గాలు

కొన్నేళ్లుగా ఈ తొట్లు నిరుపయోగంగా మారినాసర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.గత వైసీపీ ప్రభుత్వం కూడా ఈ నీటి తొట్ల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వెనుదిరుగుతున్న మూగజీవాలు

నీరు తాగేందుకు వస్తున్న మూగజీవాలు తొట్ల వద్దకు వచ్చి నీరు లేకపోవడంతో వెనుదిరుగుతనాఆ్నయి. ఎండలు తీవ్రరూపం దాల్చుతుండటంతో పశువులు దాహంతో అల్లాడుతున్నాయి. నీటితో కళకళలాడాల్సిన పశువుల నీటి తొట్లు ఒట్టిపోయి దర్శనమిస్తున్నాయి. నీటితో నింపకపోవడంతో తొట్లు గోడలు బీటలు మారుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి నిరుపయోగంగా ఉన్న నీటితొట్టిలో నీటి నిల్వ ఉంచి మూగజీవాల దాహార్తిని తీర్చాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

నీటితో నింపాలి

టీడీపీ హయాంలో మూగ జీవాలకు దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం నీటి తొట్లు నిర్మించినా ప్రయోజనం లేదు. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీటిని నిర్లక్ష్యం చసింది. నీరు లేకపోవడంతో మూగజీవాలు తాగునీరు లేక తల్లడిల్లుతున్నాయి. అధికారులు స్పందించి మూగజీవాల దాహార్తిని తీర్చాలి. - శ్రీధర్‌, డీవైఎఫ్‌ఐ నాయకుడు

నీటితో నింపుతాం

మండలంలో 25 నీటి తొట్లు నిర్మించాం. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో చర్చించి నీటితో నింపి మూగ జీవాల దాహార్తి తీరుస్తాం. దెబ్బ తిన్న తొట్లకు మరమ్మతులు చేయిస్తాం. - మద్దేశ్వరమ్మ, ఏపీవో, ఓర్వకల్లు

Updated Date - Mar 02 , 2026 | 12:12 AM