Share News

నిరుద్యోగ మహిళల ఆశలపై నీళ్లు

ABN , Publish Date - Jan 21 , 2026 | 11:50 PM

: బీఎస్‌ఎఫ్‌లో (సరిహద్దు భద్రతా దళం) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ మహిళా అభ్యర్థుల ఆశలపై బీఎస్‌ఎఫ్‌ అధికారులు నీళ్లు చల్లారు. ఆంధ్రా, కర్ణాటక రాష్ర్టాలకు పోస్టులు లేవంటూ పరీక్షా కేంద్రంలోకి అనుమతించకుండా అడ్డుకున్నారు

నిరుద్యోగ మహిళల ఆశలపై నీళ్లు
కోయంబత్తూరు బీఎస్‌ఎఫ్‌ పరీక్ష కేంద్రం వద్ద మహిళా అభ్యర్ధులు

ఆంధ్రా, కర్ణాటకకు పోస్టులు లేవన్న బీఎస్‌ఎఫ్‌ అధికారులు

ఎమ్మిగనూరు, జనవరి 21(ఆంధ్రజ్యోతి): బీఎస్‌ఎఫ్‌లో (సరిహద్దు భద్రతా దళం) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ మహిళా అభ్యర్థుల ఆశలపై బీఎస్‌ఎఫ్‌ అధికారులు నీళ్లు చల్లారు. ఆంధ్రా, కర్ణాటక రాష్ర్టాలకు పోస్టులు లేవంటూ పరీక్షా కేంద్రంలోకి అనుమతించకుండా అడ్డుకున్నారు. ఈ ఘటన బుధవారం తమిళనాడు రాష్ట్రంలోని కొయం బత్తూరులో చోటుచేసుకుంది. వివరాలు.. గత ఏడాది ఆగస్టులో బీఎస్‌ఎఫ్‌లో వివిధ పోస్టుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆంధ్రా, కర్ణాటక రాష్ర్టాలకు చెందిన అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాకు చెందిన ముగ్గురు, కర్ణాటక రాష్ర్టానికి చెందిన 12 మంది దరఖాస్తు చేసుకున్నారు. రూ.వేలు వెచ్చించి శిక్షణ తీసుకున్నారు. అర్హత పరీక్షకు అడ్మిట్‌ కార్డును సైతం అభ్యర్థులకు జారీ చేశారు. బుధవారం వారు పరీక్ష రాసేందుకు వెళ్లగా అధికారులను అడ్డుకున్నారు. మీ రాష్ర్టాలకు ఖాళీలు లేవని, మీరు వెళ్లొచ్చు అనటంతో అభ్య ర్థులు ఖంగుతిన్నారు. రాష్ట్రప్రభుత్వం జోక్యం చేసుకొని మాకు న్యాయం చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారు.

నోటిఫికేషన్‌ ఆధారంగానే దరఖాస్తు చేసుకున్నా

గత ఏడాది ఆగస్టులో బీఎస్‌ఎఫ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. టైలరింగ్‌లో పోస్టులు ఖాళీగా ఉండటంతో దరఖాస్తు చేసుకున్నా. పరీక్షకు అడ్మిట్‌ కార్డుకూడా వచ్చింది. పరీక్ష రాసేందుకు కొయం బత్తూరు వెళ్లా. పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. పోస్టులు లేవని అధికారులు అడ్డుకున్నారు. - చంద్రలేఖ, ఎమ్మిగనూరు

Updated Date - Jan 21 , 2026 | 11:50 PM