Share News

విద్యుత్‌ చార్జీల భారం ప్రజలపై పడనివ్వం

ABN , Publish Date - Jan 04 , 2026 | 11:45 PM

విద్యుత్‌ చార్జీల భారం ప్రజలపై పడనివ్వమని మంత్రి టీజీ భరత్‌ అన్నారు. ఆదివారం నగరంలోని తనిష్క్‌ ఫంక్షన్‌ హాలులో తెలుగు దేశం పార్టీ నగర అధ్యక్షుడు కొరకంచి రవీకుమార్‌ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి మంత్రి హాజరయ్యారు

విద్యుత్‌ చార్జీల భారం ప్రజలపై పడనివ్వం
మాట్లాడుతున్న పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌

వైసీపీ తప్పుడు విధానాలతో ఇబ్బందులు

కూటమి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

టీడీపీ నగర కమిటీ ఆత్మీయ సమావేశంలో మంత్రి టీజీ భరత్‌

కర్నూలు అర్బన్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ చార్జీల భారం ప్రజలపై పడనివ్వమని మంత్రి టీజీ భరత్‌ అన్నారు. ఆదివారం నగరంలోని తనిష్క్‌ ఫంక్షన్‌ హాలులో తెలుగు దేశం పార్టీ నగర అధ్యక్షుడు కొరకంచి రవీకుమార్‌ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి మంత్రి హాజరయ్యారు. నూతనంగా నియమితులైన నాయకులను అభినందించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ది పరుగులు పెడుతోందన్నారు. వైసీపీ హయాంలో 9 సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. 2019-24 మద్య కాలానీకి సంబందించి రూ. 4,498 కోట్ల ట్రూ అప్‌ చార్జీలు వసూలు చేసేందుకు ఏపీఈఆర్సీ ప్రభుత్వానికి లేఖ రాసిందని, అయితే భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వమే భరించేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలన్ని హమీలన్నీ అమలు చేశామన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను నాయకులు ప్రజలందరికి వివరించాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రిగా ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుని రాజకీయాలు చేయడం లేదని, తన అలోచన అంతా కర్నూలు నగర అభివృద్ది పైనే ఉందన్నారు. కావాలని తనను టార్గెట్‌ చేయొద్దని సూచించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలే తప్ప తన నియోజకవర్గం లోవచ్చి రాజకీయాలు చేస్తే బాగుండద న్నారు. అధిష్టానానికి తాను ఎంటో తెలుసని తెలుగు దేశం ప్రభుత్వం ఉన్నన్ని రోజులు తాను మంత్రిగానే ఉంటానన్నారు కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్‌, హజ్‌ కమిటీ సభ్యులు సూరి మన్సూర్‌ ఆలీఖాన్‌, సీనియర్‌ నాయకులు ఆకెపొగు ప్రభాకర్‌, కార్పొరేటర్లు కురువ పరమేష్‌, కైపా పద్మలతారెడ్డి, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అబ్బాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2026 | 11:45 PM