Share News

పశువైద్యం.. బహు దూరం

ABN , Publish Date - Apr 28 , 2026 | 12:12 AM

మండలంలో పశువులకు వైద్యం అందడం లేదు. పశువైద్యశాలల్లో వైద్యులు లేక, ఇన్‌చార్జి వైద్యులను నియమించారు. అయితే వారు విధులకు సక్రమంగా రాకపోవడంతో పశువులకు వచ్చే వ్యాధులు నయం కావడం లేదు

పశువైద్యం.. బహు దూరం
రాచెర్లలో మూసి ఉన్న పశువుల ఆసుపత్రి

వైద్యుల పోస్టులు ఖాలీ..

నాలుగు ఆసుపత్రులకు ఇన్‌చార్జిలే దిక్కు

ప్యాపిలి, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): మండలంలో పశువులకు వైద్యం అందడం లేదు. పశువైద్యశాలల్లో వైద్యులు లేక, ఇన్‌చార్జి వైద్యులను నియమించారు. అయితే వారు విధులకు సక్రమంగా రాకపోవడంతో పశువులకు వచ్చే వ్యాధులు నయం కావడం లేదు, మండలంలో ప్యాపిలి, జలదుర్గం, హుసేనాపురం, రాచెర్ల, చిన్నపూదిళ్లలో పశువైద్యశాలలు ఉన్నాయి. ప్యాపిలిలో అసిస్టెంట్‌ డెర్టర్‌ ఉన్నా, మిగిలిన నాలుగు వైద్యశాలల్లో వైద్యుల పోస్టులు ఖాలీగా ఉన్నాయి.

పశువైద్యశాలలు మూత

జలదుర్గం, చిన్నపూదిళ్ల, రాచెర్ల, హుసేనాపురం గ్రామాల్లోని పశువైద్యశాలల్లో ఏడాదిన్నర నుంచి వైద్యులు పోస్టులు ఖాలీగా ఉన్నాయి. అటెంర్లు కూడ లేరు. దీంతో అవి ఎప్పుడూ మూసే ఉంటున్నాయి.

పశువులు, జీవాలకు అందని వైద్యం

మండలంలో వ్యవసాయం, పాడి, గొర్రెల పెంపకంపై ప్రజలు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే పశువులు, గొర్రెలు, మేకలు వచ్చే సీజినల్‌ వ్యాధులు నయం కావడం లేదు. అధికారులు స్పందించి రెగ్యులర్‌ పశువైద్యులు, సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు.

ప్రభుత్వానికి నివేదిక పంపాం

మండలంలో నలుగురు పశువైద్యులు, 14 మంది సిబ్బంది పోస్టులు ఖాలీగా ఉన్నాయి. దీంతో పశువులకు వైద్యం చేయడం కష్టంగా ఉంది. ప్రభుత్వానికి నివేదిక పంపాం, అధికారులు పరిశీలిస్తామన్నారు. - డాక్టర్‌ విక్టర్‌, వెర్నరీ ఏడీ, ప్యాపిలి

Updated Date - Apr 28 , 2026 | 12:12 AM