ఉదయం పూట బంద్
ABN , Publish Date - Jun 09 , 2026 | 12:23 AM
పట్టణంలో యునాని వైద్యశాలలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇక్కడ వైద్యాధికారి తప్ప సిబ్బంది లేరు
వైద్యురాలికి ఇతర విధులు, మధ్యాహ్నం తరువాతే వైద్య సేవలు
యునాని ఆసుపత్రిలో సిబ్బంది కొరత
బనగానపల్లె, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో యునాని వైద్యశాలలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇక్కడ వైద్యాధికారి తప్ప సిబ్బంది లేరు. మందులు పుష్కలంగా ఉన్నా, వైద్యుడు అనివార్య కారణాల వల్ల సెలవు పెడితే ఆసుపత్రి మూత పడుతోంది. దీనికితోడు ఇక్కడ పనిచేస్తున్న వైద్యునికి నంద్యాలలో యోగా ప్రోగ్రాంకు అదనపు బాధ్యతలు అప్పగించారు. వైద్యుడు ఉదయమే అక్కడికి వెళ్లడంతో మధ్యాహ్నం వరకు వైద్యశాల మూతపడుతోంది. వైద్యం కోసం వచ్చిన రోగులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇక్కడ కాంపౌండర్, అటెండర్, స్వీపర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్యుడు సాయంత్రం వస్తుండడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి పోస్టులను భర్తీచేయాలని, ఉదయం వేళ వైద్యుడు అందుబాటులో ఉండేలా చూడాలని రోగులు కోరుతున్నారు.